వైరల్ న్యూస్

viral : 45 ఏళ్ల కిందట చోరీ.. దొంగను పట్టించిన 80s ట్రెండ్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఏఐ మానవాళికి ముప్పు తెస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ విషయం పక్కన పడితే ఏఐ మాత్రం పనిని చాలా సులభం చేస్తోంది. కేవలం టెక్నాలజీ, వర్క్ విషయంలోనే కాకుండా నేరాలను ఛేదించడంలో రేపటి రోజున పోలీసులకు ఆశా జ్యోతిగా మారనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఏఐ మానవాళికి ముప్పు తెస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ విషయం పక్కన పడితే ఏఐ మాత్రం పనిని చాలా సులభం చేస్తోంది. కేవలం టెక్నాలజీ, వర్క్ విషయంలోనే కాకుండా నేరాలను ఛేదించడంలో రేపటి రోజున పోలీసులకు ఆశా జ్యోతిగా మారనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భవిష్యత్‌లో ఫేస్ మాస్కులు ధరించి, క్యాప్స్ పెట్టుకుని తిరిగినా ఏఐ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా నిందితులను ఇట్టే పట్టేయచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక మెడికల్ పరంగా కూడా ఏఐ అద్భుతాలు చేస్తుందని చెబుతున్నారు. బాడీ హీట్, బ్లడ్ ప్లెజర్ ద్వారా భవిష్యత్‌లో గుండెపోటు వస్తుందా? వంటి సమస్యలను గుర్తించే చాన్స్ ఉందని నిపుణులు వెల్లడించారు. ఇదిలాఉండగా, 45 ఏళ్ల కింద జరిగిన చోరీలో పోలీసులు ఎలాంటి క్లూ కనుగొనలేకపోయారు. నాడు ఇంత టెక్నాలజీ లేకపోవడంతో సాధ్యం కాలేదు అనుకుందాం. తాజాగా 1980'S ట్రెండ్ తాజాగా ఆ దొంగను పట్టించింది. పోలీసులు విచారణ చేయగా.. నిందితురాలు దొంగతనం చేసినట్టు అంగీకరించడం గమనార్హం.

వివరాల్లోకివెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 1980ల ఆరంభంలో ఓ నగల దుకాణంలో బంగారు గొలుసు చోరీ చేసిన యువతి ఆ తర్వాత పేరు మార్చుకుని మరో ప్రాంతంలో జీవిస్తోంది. నాడు విచారణ జరిపిన పోలీసులు ఆ దొంగను ఎంతకూ పట్టుకోలేకపోయారు.దీంతో షాపు యాజమాని సైతం ఆశలు వదిలేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980'S ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. దీంతో సదరు నిందితురాలు 80లలో తాను ఉండేదాన్నో మరో సారి చూసుకోవాలని అనుకున్నది.

ప్రస్తుతం తన ఫొటో ఇచ్చి మార్చాలని ఏఐని కోరింది. తీరా వచ్చిన పిక్చర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా..అనుకోకుండా దొంగతనం చేసిన యువతి ఫొటో బంగారు షాపు యాజమాని కంట పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పిక్ పోస్టు చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. 45 ఏళ్ల కింద బంగారు గొలుసు దొంగిలించింది తానే అని అంగీకరించడంతో ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ అయ్యింది. పోలీసులు 45 ఏళ్లుగా చేయలేనిది ఏఐ ఒక్క రోజులో పట్టించిందని అంతా మాట్లాడుకుంటున్నారు.

https://x.com/greatandhranews/status/2099855156020142484?s=20

#1980's trend#chain stolen case#findout#convict#AI#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి