తెలంగాణ

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం నిషేధం.. పోలీసుల కఠిన ఆంక్షలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని ప్రముఖ అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), నగర పోలీసు విభాగం సంయుక్తంగా పూర్తిగా నిషేధించాయి. తెలంగాణ హైకోర్టు గతంలో జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారమే ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

 హైదరాబాద్‌లోని ప్రముఖ అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), నగర పోలీసు విభాగం సంయుక్తంగా పూర్తిగా నిషేధించాయి. తెలంగాణ హైకోర్టు గతంలో జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారమే ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట హెచ్చరిక ఫ్లెక్సీలు, ప్రత్యేక బ్యానర్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు.

 హుస్సేన్‌సాగర్ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, న్యాయస్థాన నిబంధనలకు అనుగుణంగా భక్తులు, ఉత్సవ నిర్వాహకులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అప్పర్ ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్డు నుంచి విగ్రహాలను నీటిలోకి వదలకుండా నిరోధించేందుకు ప్రత్యేక ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన 'బేబీ పాండ్లు' (కృత్రిమ చెరువులు) లోనే చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయాలని యంత్రాంగం భక్తులకు స్పష్టమైన సూచనలు చేసింది.

 అదే సమయంలో భారీ విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ వైపు ఉన్న ప్రత్యామ్నాయ ఘాట్ల వద్ద ప్రత్యేక క్రేన్లు, ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కూడా ఎన్టీఆర్ మార్గ్‌లోని నిర్దేశిత ఘాట్ వద్దే వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనివల్ల నగరంలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవం జరిగేలా ప్రణాళికలు రూపొందించారు.

 ఈ నిబంధనలు ఉల్లంఘించి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను తరలించకుండా నిరోధించడానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. భక్తులంతా నిర్దేశిత ఘాట్లు, బేబీ పాండ్లను మాత్రమే ఉపయోగించుకుని నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

#GaneshImmersion#TankBund#GHMC#HyderabadPolice#HussainSagar#KhairatabadGanesh#TelanganaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి