తెలంగాణ

TG : చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవి

రచన: Kumar4 నిమిషాల పఠనం

కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీగా మార్చి ‘ఐ బొమ్మ’(iBomma) వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు జనాలను బెట్టింగ్ యాపుల వైపు అట్రాక్ట్ అయ్యేలా ప్రోత్సహించిన కేసులో ఐబొమ్మ రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీగా మార్చి ‘ఐ బొమ్మ’(iBomma) వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు జనాలను బెట్టింగ్ యాపుల వైపు అట్రాక్ట్ అయ్యేలా ప్రోత్సహించిన కేసులో ఐబొమ్మ రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రం విశాఖపట్టణంకు చెందిన రవి.. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఐ బొమ్మ సామ్రాజ్యాన్ని నడిపించాడు.సినిమాలను పైరసీ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల కంటే బెట్టింగ్ యాప్స్‌ను ‘ఐ బొమ్మ’ సైట్లో ప్రమోట్ చేసినందుకు గాను రూ.వందల కోట్ల ఆస్తులు పొగేసుకున్నాడు.

ఓ పని మీద హైదరాబాద్‌కు వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. డార్క్ సీక్రెట్ వ్యవహారం మొత్తం బయటపడింది. అయితే, కోర్టు కేసులు, జైలు శిక్ష అనంతరం ఇటీవల రవి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అతని పాస్ పోర్టు సైతం ప్రస్తుతం పోలీసుల వద్దే ఉన్నట్టు సమాచారం. అతని ఖాతాల్లోని డబ్బులు, ఆస్తులను కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులు ఫ్రీజ్ చేశాయి. దీంతో రవి విదేశాలకు వెళ్లలేక సాధారణ జీవితం గడపలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ అవ్వడంతో తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని పిటిషన్ వేసినట్టు సమాచారం. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని,కుటుంబ పోషణ, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు కూడా భారంగా మారాయని, ఇతరుల మీద ఆధార పడాల్సివస్తోందని తన సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

కుటుంబ జీవనం సాగించడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా తన ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాల్లో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం దీనిపై పోలీసుల వివరణ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగగా, పైరసీ కింగ్ పిన్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇమ్మడి రవి..

ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. నెదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటుచేశాడు. ER infotech అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి CEO గా ఉన్నాడు. నెదర్లాండ్స్ నుంచి Cloud fare, OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీలలో ప్రదర్శించినట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

https://x.com/AvmNews7/status/2100083547667353756?s=20

#Ibomma ravi#nampally court#petition file#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి