సినిమా

Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Samyuktha Menon: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు హీరోయిన్ సంయుక్త మేనన్ పుట్టిన రోజు సందర్భంగా..ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తున్న విషయాన్ని అఫీషియల్‌గా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు.

రామ్ పోతినేని మొదటిసారి మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్న రాపో 23 ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకి కథ, మాటలు కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. నిర్మాతగా రామ్ పోతినేని సోదరుడు వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్, కేరళలో లాంగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఇక, ఈ సినిమాను సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు రామ్ పోతినేని.

కాగా, ఈ సినిమా కోసం ‘లోన్ వుల్ఫ్’ అనే వెరైటీ టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే, హీరోయిన్ విషయంలో ఇన్నాళ్ళు కొనసాగుతున్న బిగ్ సస్పెన్స్ కి తెరపడింది. భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈరోజు సంయుక్త బర్త్ డే కావడంతో టీమ్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.

విరూపాక్ష, అఖండ 2, డెవిల్, సార్, నారి నారి నడుమ మురారి లాంటి సినిమాలలో నటించింది సంయుక్త. ఇప్పుడు రాపో 23లో అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాత. ఇటీవల, రామ్ కి సాలీడ్ హిట్ దక్కలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందివ్వలేదు. మరి, మొదటిసారి మెగాఫోన్ పట్టి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

#Samyuktha Menon#Ram Pothineni#Rapo 23#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి