Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. దసరా పండుగనాడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మోక్షజ్ఞ డెబ్యూ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా మల్లిడి వశిష్ట ఎంపికైయ్యాడు. బింబిసార సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న వశిష్ట, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వీఎఫెక్స్ పనులు సజావుగా సాగడంలేదని అందుకే, విశ్వంభర విడుదల వాయిదా పడుతుందని చెప్పుకుంటున్నారు.
అయితే, మోక్షజ్ఞ మొదటి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మల్లిడి వశిష్టకి రావడం మాత్రం ఊహించని అవకాశం అనుకోవాలి. అయితే, విశ్వంభర రిలీజ్ తర్వాత మోక్షజ్ఞ సినిమాను మొదలుపెడతాడా లేక విశ్వంభర చిత్రాన్నే పక్కన పెడతాడా..! అనేది ఓ పక్క ఆసక్తికరమైన చర్చగా సాగుతోంది. కీరవాణి కూడా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే వారణాసి బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఆయన స్థానంలో గౌరి హర వచ్చి చేరాడు.
అయితే, నవంబర్ లేదా డిసెంబర్ నుంచి మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో ఓ కీ రోల్ కూడా ప్లే చేయనున్నట్టుగా తాజా సమాచారం. వారసుల సినిమాలలో తండ్రులు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, ఇలా మొదటి సినిమాలో గనక స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్. అందుకే, మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే, నిజమైతే నందమూరి అభిమానులకి పండుగే.











