Sai Pallavi: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఏ హీరోయిన్ అయినా, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుంది. అలా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా ఇక్కడ స్టార్ ఇమేజ్ వచ్చాక, హిందీ సినిమాలలో ఛాన్స్ వచ్చింది. అయితే, ఇది..ప్లాన్ చేసుకుందా లేక అదృష్టం వరించిందా.. తెలీదు గానీ, హిందీలో వచ్చిన అవకాశం మాత్రం రామాయణ సినిమాలో సీతాదేవి పాత్ర.
ఇంతటి విశేషమైనటువంటి పాత్ర చేసే అవకాశం పెద్ద పెద్ద హీరోయిన్స్ కి కూడా దక్కదు. కానీ, ఈ విషయంలో సాయి పల్లవి లక్కీ అని చెప్పాలి. హిందీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా రామాయణ. బాలీవుడ్ అగ్ర నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో,దర్శకుడు నితేశ్ తివారీ డైరెక్షన్ లో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతుంది.
అయితే, తాజాగా..ఢిల్లీలో జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నటీమణులకు సీతాదేవి లాంటి పవిత్రమైన పాత్ర దక్కడం అంత సులభం కాదు. ఈ పాత్ర నాకు దక్కడం అదృష్టమని తెలిపింది. ఇక, ఈ పాత్రకు న్యాయం చేయడానికని, నేను నిరంతరం ధ్యానం చేస్తూ, నా ఆలోచనలను పవిత్రంగా ఉంచుకునేదాన్ని అంటూ రామాయణ సినిమాకు తాను తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తల గురించి చెప్పింది.
అలాగే, సీతాదేవే నా ద్వారా నటింపజేయాలని రోజూ ప్రార్థించేదాన్ని. కాబట్టే, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ సాయి పల్లవి.. ఈవెంట్ లో భావోద్వేగానికి లోనయ్యింది. అంతేకాదు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా రామాయణ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చిత్ర బృందం ఎంతగానో కష్టపడుతోంది..అని కూడా చెప్పింది సాయి పల్లవి. ఇప్పుడు, ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, సాయి పల్లవి..బాలీవుడ్ లో ఓ గొప్ప చిత్రం చేసిందనే అనుభూతిలో ఉంది.












