క్రీడలు

PV Sindu : పీవీ సింధు నయా రికార్డు.. జపాన్ ఓపెన్ టైటిల్ సొంతం

రచన: Kumar3 నిమిషాల పఠనం

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పీవీ సింధు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చాలా కాలం తర్వాత జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది.

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పీవీ సింధు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చాలా కాలం తర్వాత జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది. గత కొంతకాలంగా పీవీ సింధు కెరీర్‌లో ఇబ్బందులు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. తను ఆడిన గేమ్స్‌లో వరుస ఓటములు ఆమెకు నిరాశను మిగిల్చాయి. ఇంతకాలం తర్వాత ఆమె కఠోర శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది.

ప్రతిష్టాత్మక ‘జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750’ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు..తన కెరీర్‌లోనే తొలిసారిగా, ఏ భారత షట్లర్‌కు సాధ్యం కాని ‘జపాన్ ఓపెన్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ స్టార్ షట్లర్, డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యామగుచీపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి పట్టువదలకుండా ప్రయత్నించి గట్టి పోటీని ఇచ్చినప్పటికీ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లిన సింధు టైటిల్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

తన అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి యామగుచీని ఒత్తిడిలోకి నెట్టి 21-14, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో ఘన విజయం సాధించింది. కొంతకాలంగా సరైన టైటిల్ లేక ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సింధుకు ఈ విజయం కాస్త ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి.ఎట్టకేలకు మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్‌గా సింధు సరికొత్త రికార్డును సృష్టించగా.. సింధు మరిన్ని ఇలాంటి విజయాలు సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

#batmintion player pv sindu#japan open super -750#winner#india#sports
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి