క్రీడలు

Fifa World cup : ఫిఫా హిస్టరీలోనే తొలిసారి.. విజేతలకు సరికొత్త బహుమతులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

సాకర్ ప్రపంచంలో ఫిఫాకు ఎనలేని క్రేజ్ ఉంది. ప్రపంచకప్ వస్తుందంటే చాలు ఫుట్‌బాల్ క్రీడను ఆరాధించే దేశాలు సంబురాల్లో మునిగిపోతుంటాయి. ముఖ్యంగా యూరప్ కంట్రీస్ సంబురాల్లో మునిగితేలుతుంటాయి. ఫిఫా వరల్డ్ కప్-2026 తుది ఘట్టానికి చేరుకుంది.వ సెమీఫైనల్స్ కూడా ముగిశాయి.

సాకర్ ప్రపంచంలో ఫిఫాకు ఎనలేని క్రేజ్ ఉంది. ప్రపంచకప్ వస్తుందంటే చాలు ఫుట్‌బాల్ క్రీడను ఆరాధించే దేశాలు సంబురాల్లో మునిగిపోతుంటాయి. ముఖ్యంగా యూరప్ కంట్రీస్ సంబురాల్లో మునిగితేలుతుంటాయి. ఫిఫా వరల్డ్ కప్-2026 తుది ఘట్టానికి చేరుకుంది.వ సెమీఫైనల్స్ కూడా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు టిటైల్ కోసం తలపడనున్నాయి. ఈసారి కప్ ఎవరిని వరిస్తుందో అని ఆ రెండు దేశాల అభిమానులే కాకుండా యావత్ ఫుట్‌బాల్ ప్రేక్షులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలాఉండగా, ఫుట్‌బాల్ హిస్టరీలో ఫైనల్ మ్యాచ్‌ సరికొత్త రికార్డును సృష్టించనుంది. టైటిల్ ట్రోఫీని గెలిచే జట్టుకు మెడల్స్‌తో పాటు స్పెషల్‌గా ‘చాంపియన్‌షిప్ రింగ్స్’ బహుకరించనున్నారు. ఫిఫా చరిత్రలో గెలిచిన వారికి ఇలాంటి ఉంగరాలను అందించడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడలైన ఎన్ఎఫ్ఎల్ (NFL), ఎన్‌బీఏ (NBA), మేజర్ లీగ్ బేస్ బాల్ (MLB) వంటి పోటీల్లో గెలిచిన జట్లకు ఇలాంటి చాంపియన్‌షిప్ రింగ్స్ ఇచ్చే సాంప్రదాయం ఉంది.

ఇప్పుడు దానిని ఫిఫా టోర్నీలో కూడా పరిచయం చేస్తున్నారు. కాగా, 2026 వరల్డ్ కప్‌ను గుర్తుచేస్తూ కేవలం 2,026 ఉంగరాలను మాత్రమే ఫిఫా ప్రత్యేకంగా తయారు చేయించింది. వాటిలో 30 ఉంగరాలను ఫైనల్‌లో గెలిచిన జట్టులోని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కోసం కేటాయించారు. మిగిలిన 1,996 ఉంగరాలను ఫిఫా అఫీషియల్ లైసెన్స్‌డ్ ప్రొడక్ట్స్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కోసం విక్రయిస్తారని తెలుస్తోంది.ప్రతి ఉంగరం మీద ఒకవైపు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ లోగో, మరోవైపు విజేతగా నిలిచిన జట్టుకు సంబంధించిన లోగో లేదా ఐడెంటిటీని ప్రింట్ చేశారు.ప్రతి రింగ్‌కు ఓ ప్రత్యేకమైన నంబర్ కూడా ఉంటుంది. అది నిజమైనదా? కాదా? అని గుర్తించడానికి వీలుగా ముద్రించినట్టు సమాచారం.

#Fifa world cup-2026#rings#special#title winner#Football
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి