సినిమా

NBK 112: బాలయ్య-కొరటాల శివ మూవీ టైటిల్ ఫిక్స్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

NBK 112: కొన్ని కాంబినేషన్స్ మీద అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో, సినీ లవర్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి రేర్ కాంబినేషన్ కొరటాల శివ, నందమూరి బాలకృష్ణలది. అసలు, ఈ కాంబోలో సినిమాను ప్రకటిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ప్రయోగాలంటే బాలయ్య ముందు ఉంటారు. దర్శకుడిలో సత్తా ఉందా లేదా అని చూస్తారు తప్ప హిట్స్ తీస్తున్నాడా, ఫ్లాప్ లో ఉన్నాడా అని చూడరు.

కాబట్టే, బాలయ్య తన 112వ సినిమాను రూపొందించే అవకాశం ఫ్లాప్స్ లో ఉన్న కొరటాల శివకి ఇచ్చాడు. ఇటీవలే వీరి సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ ఆగస్టు నుంచి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అంతేకాదు, 20 రోజుల పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని బాలయ్యపై షూట్ చేయబోతున్నాడు కొరటాల శివ. ఇక, బాలయ్య సినిమా టైటిల్ గురించి కూడా ప్రతీ ఒక్కరిలో మంచి ఆసక్తి ఉంటుంది.

అందుకు, తగ్గట్టే బాలయ్య పాత్ర, అందుకు తగ్గ టైటిల్, మేకోవర్ ఉంటాయి. మరీ ముఖ్యంగా గత కొన్నేళ్ళుగా బాలయ్య సినిమాలలో గెటప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైతే, కొరటాల శివ సినిమాలో ఆయన గెటప్ ఎలా ఉంటుందో హింట్ ఇవ్వలేదు. అయితే, టైటిల్ విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాలయ్య నటించబోతున్న 112వ సినిమాకి "కార్పెంటర్" అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది.

ఇందులో, ఎంతవరకూ నిజముందో తెలీదు గానీ, ఇదొక మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మాత్రం టైటిల్ తో అర్థమవుతోంది. చూడాలి, మరి అఫీషియల్ గా మూవీ టైటిల్ ని ఎప్పుడు రిలీవ్ చేస్తారో. ఇక, కొరటాల ఇవ కి ఆచార్య, దేవర సినిమాలతో వరుస ఫ్లాప్స్ వచ్చాయి. ఎలాగైనా, బాలయ్య సినిమాతో సాలీడ్ హిట్ కొట్టి మళ్ళీ ఫాంలోకి రావాలని కసితో ఉన్నాడు. అంతేకాదు, వరుస హిట్స్ తో ఉన్న బాలయ్యకి కూడా అఖండ 2 ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. కాబట్టి, బాలయ్యకి..గోపీచంద్ మలినేని, కొరటాల సినిమాలతో హిట్స్ పడాల్సిందే.

#nbk112#nandamuribalakrishna#koratalashiva#nbk112tittle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి