తెలంగాణ

TG : పాలమూరుపై శుభవార్త.. ట్రయల్ రన్ విజయవంతం

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఎన్‌నినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జులై మాసం పూర్తయ్యేందుకు వచ్చినా ఇంతవరకు మోస్తరు నుంచి భారీ వర్షాల జాడ కానరాలేదు.చెప్పుకోదగిన విధంగా రెండ్రోజులు వర్షాలు కురవలేదు.

రాష్ట్రంలో ఎన్‌నినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జులై మాసం పూర్తయ్యేందుకు వచ్చినా ఇంతవరకు మోస్తరు నుంచి భారీ వర్షాల జాడ కానరాలేదు.చెప్పుకోదగిన విధంగా రెండ్రోజులు వర్షాలు కురవలేదు. దీంతో ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం రోజురోజుకూ పడిపోతున్నది. వర్షాలు లేక చెరువులు, కుంటల్లోనూ నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నీళ్లు ఎత్తిపోయకపోవడంతో నీళ్లు లేక సాగు ఆలస్యం అవుతోంది.

ఇదిలాఉండగా, కాళేశ్వరం నీళ్లు వృథాగా పోతున్నాయని.. నీటిని ఎత్తిపోయాలని హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు త్వరగా రిపేర్లు పూర్తి చేయాలని, ప్రభుత్వం పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నదని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.దీనిపై మరో రెండ్రోజుల్లో విచారణ జరుగుతుందని సమాచారం.

https://x.com/TNewsTelugu/status/2078432587014656161?s=20

ఈ క్రమంలోనే పాలమూరు -రంగారెడ్డిపై సర్కారు శుభవార్త చెప్పింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండో బాహుబలి మోటర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. 145 మెగావాట్ల మోటర్ పూర్తి సామర్థ్యంతో పనిచేసిందని అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు.ఇదిలాఉండగా, ప్రాజెక్టు,మోటర్ల నిర్మాణం కేసీఆర్ హయాంలో జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 34 నెలలుగా ప్రాజెక్టు ప్రారంభం కాలేదని, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది.

#palamuru rangareddy#irrigation project#bahubali motar#trailrun success
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి