సినిమా

Rowdy Janardhana: ఇలాంటి టైమ్ లో అంత రిస్క్ అవసరమా విజయ్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Rowdy Janardhana: సినిమా విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, దర్శక-నిర్మాతలైనా రిస్క్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడితేనే అన్నిటికీ మంచిది. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరో విజయ్ దేవరకొండ, నష్టాలలో ఉన్న నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా రౌడీ జనార్ధన. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. సలార్, పుష్ప, బాహుబలి సినిమాల తరహలోనే రౌడీ జనార్ధన కూడా రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారట.

ఇద్దరు చేస్తుంది రిస్కేనా?

దిల్ రాజు-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఇంతకముందు ఫ్యామిలీ స్టార్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు వీరిద్దరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీళ్ల హుషారు, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో డాన్సులు చూసి మరో గీత గోవిందం అని అందరూ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఫ్లాపై అటు దిల్ రాజుకి..ఇటు విజయ్ దేవరకొండకి షాకిచ్చింది.

ఆ కమిట్‌మెంట్ తోనే మళ్ళీ దిల్ రాజుకి ఇంకో సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చాడు విజయ్. ఆ సినిమానే ఇప్పుడు సెట్స్‌పై ఉన్న రౌడీ జనార్ధన. ఇటీవల వచ్చిన రణబాలి సినిమాతో మరోసారి ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ఇప్పుడు, చేతిలో ఉన్న రౌడీ జనార్ధన సినిమా మీదే విజయ్ హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు. ఎట్టి, పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాల్సిందే. కానీ, మేకర్స్ ప్లానింగ్ చూస్తుంటే సెన్స్ కాస్త తేడాగా అనిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో విజయ్‌కి ఒక్క పార్ట్ గా తీసిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలాంటిది, ఫక్తు యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోన్న రౌడీ జనార్ధన కథకి రెండు భాగాలుగా తీసేంత స్కోప్ ఉందా అన్నది అందరిలో కలుగుతున్న సందేహాలు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కాంబినేషన్ మీద కూడా కొందరిలో సందేహాలున్నాయి. వీరిద్దరినీ ఆన్‌స్క్రీన్ మీద ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు. ఖుషి సినిమా ఫ్లాప్‌కి కూడా సమంత-విజయ్‌ల జోడీ మ్యాచ్ కాకనే అని మాట్లాడుకున్నారు. ఇన్ని, సందేహాల మధ్య రూపొందుతోన్న రౌడీ జనార్ధన కి రెండు భాగాలంటే మరో పెద్ద సమసే అంటున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తే బావుంటుంది.

#Rowdy Janardhana#Vijay Devarakonda#Keerthy Suresh#Dil Raju#Ravi Kiran Kola
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి