National

Gold Price: భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. అసలు కారణాలు ఇవే!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Gold Price: కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. మార్కెట్లో రేట్లు భారీగా పడిపోతుండటంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే, ఇన్వెస్టర్లు మాత్రం షాక్ తింటున్నారు.

Gold Price: కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. మార్కెట్లో రేట్లు భారీగా పడిపోతుండటంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే, ఇన్వెస్టర్లు మాత్రం షాక్ తింటున్నారు. అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, అమెరికా నుంచి వస్తున్న తాజా ఆర్థిక లెక్కల దెబ్బకు పసిడి రేట్లు దాదాపు నాలుగు నెలల కనిష్టానికి జారిపోయాయి. అటు వెండి కూడా ఔన్స్‌కు 50 డాలర్ల కంటే కిందికి పడిపోయింది.

మన మార్కెట్లలోనూ భారీ పతనం..

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో మన దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లోనూ రేట్లు దిగజారాయి. బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,263కి పడిపోగా, వెండి కేజీ ధర రూ.1,84,245 దాకా తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 3,956 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడమే ఈ భారీ తగ్గుదలకు దారితీసిందని చెబుతున్నారు.

ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక పరిస్థితి. అక్కడ ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకుని 3.6 శాతానికి చేరింది. దానికితోడు మూడో క్వార్టర్‌లో వారి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి గ్రోత్ చూపించింది. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడ్) ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించకపోగా, డిసెంబర్‌లో మరికొంత పెంచే ఆలోచనలో ఉందనే వార్తలు బయటకు వచ్చాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండి, డాలర్ బలపడితే.. ఎలాంటి వడ్డీ రాని బంగారం, వెండిపై పెట్టిన డబ్బును ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుని ఇతర వాటిల్లో పెడుతుంటారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందు ముందు మరింత తగ్గుతాయా

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల భయాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే వడ్డీ రేట్ల ఒత్తిడే బంగారంపై ఎక్కువగా కనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం మన దేశంలో పసిడి రేటు రూ.1,40,000 వరకు, వెండి రూ.1,80,000 వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ బ్యాంక్ తీసుకునే తుది నిర్ణయాన్ని బట్టే బంగారం రేటు మళ్లీ పెరుగుతుందా లేక మరింత తగ్గుతుందా అనేది తేలనుందని చెబుతున్నారు.

#Gold Price#Silver Price#Gold Rate Today#Silver Rate Today#Gold Price Crash#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి