తెలంగాణ

డిసెంబర్‌లోపు ఇళ్ల స్థలాలు- జర్నలిస్టులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

రచన: NK•••3 నిమిషాల పఠనం

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను సీఎం అయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నానని, ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వాస్తవానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చానన్న రేవంత్ రెడ్డి.. కోర్టు ఆర్డర్ వల్ల ఆగిపోవాల్సి వచ్చిందన్నారు.

Cm Revanth: డిసెంబర్‌లోపు ఇళ్ల స్థలాలు- జర్నలిస్టులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Cm Revanth: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను సీఎం అయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నానని, ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వాస్తవానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చానన్న రేవంత్ రెడ్డి.. కోర్టు ఆర్డర్ వల్ల ఆగిపోవాల్సి వచ్చిందన్నారు.

డిసెంబర్ లోపు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కమిట్ మెంట్ తో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు ఇళ్ల స్థలాలు ఇస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు. ఆ వెంటనే రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.

జర్నలిస్టులకు ప్రత్యేకంగా లేఅవుట్..

అధికారులు, ఎమ్మెల్యేలతో లింకు లేకుండా జర్నలిస్టులకు ప్రత్యేకంగా లేఅవుట్ చేయాలని మంత్రి పొంగులేటికి సూచించారు. రేపే సంబంధిత అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయాలని మంత్రితో చెప్పారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో చిన్నపిల్లలతో లాటరీ తీయించాలని మంత్రి పొంగులేటికి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

#Cm Revanth#Telangana#Journalists#House Sites#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి