సినిమా

Aadarsha Kutumbam: ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..పాపం ఫ్యాన్స్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Aadarsha Kutumbam: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం మూవీలో మీరు చెప్పిన ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..అంటూ పాపం ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో ఈ అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.

Aadarsha Kutumbam: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం మూవీలో మీరు చెప్పిన ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..అంటూ పాపం ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో ఈ అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే, థమన్ ఈ సినిమాలో 9 పాటలున్నాయని ఊదరగొట్టాడు. కానీ, సినిమాలో రెండు పాటలే ఉన్నాయట. ఈ విషయంలో ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం తరువాత, మళ్ళీ ఇంతకాలానికి గురూజీ తెరకెక్కించిన సినిమా ఆదర్శకుటుంబం కావడం ఒకటి అయితే.. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి గురూజీ రచయితగా చేయడం ఇంతకాలానికి వెంకీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా కావడం మరొకటి. అందుకే, ఈ సినిమా విషయంలో హైప్ బాగా పెరిగిపోయింది.

ఆదర్శకుటుంబం ప్రమోషన్స్ ప్రారంభం అయినప్పటి నుంచి రిలీజైన సాంగ్స్ కి ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. నారాయణమ్మ అంటూ ఇటీవల రిలీజైన సాంగ్ కూడా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. కానీ, 'మాలా వచ్చా చూడు' అనే సాంగ్ మాత్రం జనాలకి తెగ నచ్చింది. ఈ పాటలో వెంకీ లాంటి హీరో.. పక్కింటి అమ్మాయితో నలగాలి పూలు ఒళ్లు, అరవాలి మంచం కోళ్లు అంటూ.. ఊర మాస్ లిరిక్స్ తో స్టెప్స్ వేయడం, గ్లామర్ బ్యూటీ నివేతా లాంటి అందం వెంకీతో రొమాన్స్ చేయడంతో ఈ సాంగ్ థియేటర్ లోనే చూడాలనే ఆసక్తి అందరికీ కలిగింది.

కానీ, గురూజీ ప్రేక్షకులకు షాకిచ్చాడు. అసలు, ఈ పాట థియేటర్స్‌లో కనిపించలేదు. థమన్ చెప్పినట్టుగా సినిమాలో ఆ తొమ్మిది పాటలు రాలేదు. దీంతో సినీ లవర్స్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. థియేటర్ లో మాలా సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ ని తీసేయడం ప్రేక్షకులకు అతిపెద్ద నిరాశగా మారింది. ఆదర్శకుటుంబం సెన్సార్, రన్ టైమ్ విషయంలో అందరూ హ్యాపీ..కానీ, సినిమా డిసప్పాయింట్ చేయడం ఒకెత్తైతే..ఆశించిన పాటలు లేకపోవడం మరో రకమైన నిరాశ.

#Aadarsha Kutumbam#Venkatesh#Srinidhi Setty#Trivikram#SS.Thaman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి