తెలంగాణ

TG: భట్టి క్యాంప్ ఆఫీసులపై రచ్చ! ఖజానా ఖాళీ అంటూనే జీవోలు..

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని, గత పాలకుల వల్లే నిధుల కొరత ఏర్పడిందని పదేపదే చెబుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తన క్యాంప్ ఆఫీసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.

TG: రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని, గత పాలకుల వల్లే నిధుల కొరత ఏర్పడిందని పదేపదే చెబుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తన క్యాంప్ ఆఫీసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే సకల సౌకర్యాలున్న ‘ప్రజాభవన్’ అధికారిక నివాసంగా ఉండగా.. సొంత నియోజకవర్గమైన మధిర, అటు ఖమ్మం కేంద్రంగా వరుస భవనాల రినోవేషన్లు, నిర్మాణాల పేరుతో జీవోల మీద జీవోలు విడుదల చేయడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.

మధిర క్యాంప్ ఆఫీస్‌కే భారీగా నిధులు

మధిరలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఆధునీకరణ కోసం దాదాపు రూ. 1.50 కోట్లు కేటాయించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, పీఏ గది, కలరింగ్ కోసం రూ. 40.81 లక్షల విలువైన టెండర్‌ను 'ఆర్ ఎన్ కన్‌స్ట్రక్షన్స్'కు ఇచ్చినట్లు వివరాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'గడీల పాలన' అంటూ మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు సొంత కార్యాలయాల చుట్టూ భారీ ప్రహరీ గోడల పేరిట అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారంటూ నెటిజన్లు విమర్శులు చేస్తున్నారు.

ఆర్ అండ్ బీ క్వార్టర్.. మళ్లీ రూ. 4.50 కోట్లతో

మరోవైపు ఖమ్మంలో ఉన్న ఆర్ అండ్ బీ ఈఈ రెసిడెన్షియల్ క్వార్టర్‌ను స్వాధీనం చేసుకుని, దాని రినోవేషన్ కోసం రూ. 47.20 లక్షల టెండర్‌ను దేరంగుల రామారావు అనే వ్యక్తికి అప్పగించారని విమర్శకులు వస్తున్నాయి. అదే ఆవరణలో సమావేశాల హాలు, పీఏ రూమ్, సెక్యూరిటీ సిబ్బంది గదుల కోసం మరో రూ. 70.11 లక్షలు వెచ్చించినట్లు లెక్కలు బయటపెడుతున్నారు. ఇంతటితో ఆగకుండా ఖమ్మంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ కొత్త భవన నిర్మాణం కోసం ఏకంగా రూ. 4.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలు, పెండింగ్ బిల్లులకు డబ్బుల్లేవంటూ సాకులు చెబుతున్న పాలకులు.. నాయకుల ఆఫీసుల కోసం మాత్రం అడిగినంత విడుదల చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ నిధుల కేటాయింపులపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

#Telangana News#Bhatti Vikramarka#Telangana Government#Congress Government#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి