సినిమా

Rapo 23: రామ్ పోతినేని సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rapo 23: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేని కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా 'రాపో23' అని పిలుస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఘనంగా ఓపెనింగ్ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న సమాచారం మేరకు ఈ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో హీరో రామ్ పోతినేనికి గట్టి పోటీ ఇచ్చే విలన్ పాత్ర ఉండగా, దీని కోసం ఓ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్‌ను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ జస్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు, రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా కాకుండా, హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రేక్షకులకు కొత్తగా థ్రిల్ చేసే సైకలాజికల్ డ్రామా అంశాలను కూడా రామ్ జోడించాడట.

మరీ ముఖ్యంగా కథలో ఉండే పాత్రలు, హీరో-విలన్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయట. ఇదొక స్టైలిష్ అండ్ ఇంటెన్స్ మూవీ అని, ఇందులో బాలీవుడ్ స్టార్ విలన్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు..జాకీ ష్రాఫ్. ఇంతకముందు కూడా జాకీ తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగులో ఈ సీనియర్ నటుడికి మంచి క్రేజ్ ఉంది.

అందుకే, రాపో 23 మూవీలో ఉన్న పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం రామ్, జాకీని ఎంచుకున్నాడట. వీరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ సినిమాకి బాగా హైలెట్ అవుతాయని యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. రామ్ నటించిన గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించి ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో మంచి కమర్షియల్ బ్రేక్ అందుకోవాలని కసితో ఉన్నాడు.

#rampothineni#jackieshroff#rapo23#Heroram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి