సినిమా

Kiran Abbavaram: పవన్ అంటే ప్రాణం.. కానీ ఆయ‌న‌తో సినిమాకు నో

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటారు. తాజాగా ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా షేర్ అవుతున్నాయి. తాను పవన్ కళ్యాణ్‌కు ఎంత పెద్ద హార్డ్ కోర్ ఫ్యానో చెబుతూనే, ఆయన సినిమా ఆఫర్ వస్తే తను తీసుకోబోయే ఒక సంచలన నిర్ణయం గురించి కిరణ్ ఓపెన్‌గా మాట్లాడారు.

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటారు. తాజాగా ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా షేర్ అవుతున్నాయి. తాను పవన్ కళ్యాణ్‌కు ఎంత పెద్ద హార్డ్ కోర్ ఫ్యానో చెబుతూనే, ఆయన సినిమా ఆఫర్ వస్తే తను తీసుకోబోయే ఒక సంచలన నిర్ణయం గురించి కిరణ్ ఓపెన్‌గా మాట్లాడారు.

సినిమాల్లోకి రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ అంటే తనకు పిచ్చని, కాలేజ్ రోజుల్లో, ఉద్యోగం చేసేటప్పుడు ఆయన కోసం ఎంతో క్రేజీగా ఫ్యానిజం చేశానని కిరణ్ గుర్తు చేసుకున్నారు. పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే చొక్కాలు చింపుకునే రేంజ్‌లో ఎంజాయ్ చేసేవాడినని చెప్పారు. అయితే, ఇంతటి డైహార్డ్ ఫ్యాన్ అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే మాత్రం ఒక కండిషన్ పెడుతున్నానని స్పష్టం చేశారు. పవన్ సినిమా కదా అని కళ్ళు మూసుకుని సైన్ చేయనని, కేవలం ఆయన సినిమా అనే ఒకే ఒక్క కారణంతో తనకు నచ్చని చిన్న పాత్రలను ఒప్పుకోనని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆఫర్ వచ్చి, ఆ క్యారెక్టర్ గనుక తనకు పర్ఫెక్ట్‌గా నచ్చితే, అంతకంటే జీవితంలో పెద్ద ఆనందం మరొకటి ఉండదన్నారు.

ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న కొన్ని రూమర్లపై కిరణ్ అబ్బవరం ఘాటుగానే స్పందించారు. సందర్భాన్ని బట్టి తాను ఫేవరెట్ హీరోలను మార్చేస్తానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా తిప్పికొట్టారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తన ఫేవరెట్ హీరో ఒకే ఒక్కడు.. ఆయనే పవన్ కళ్యాణ్ అని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక హీరో పడే కష్టాలు, శ్రమ ఏంటో తనకు ప్రాక్టికల్‌గా తెలిసొచ్చిందని, అందుకే ఇప్పుడు ప్రతి హీరోను గౌరవిస్తానని, ప్రేమిస్తానని చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో తన పాత వీడియోలను కట్ చేసి, కొందరు పనిగట్టుకుని తప్పుడు అభిప్రాయాలు క్రియేట్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాల గురించి తాను ఎక్కువగా తలబద్ధలు కొట్టుకోనని, తన వ్యక్తిత్వం ఏంటనేది కాలమే డిసైడ్ చేస్తుందంటూ కిరణ్ అబ్బవరం ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

#pawankalyan#kiranabbavaram#Tollywood#Cinemanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి