Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటారు. దర్శకులు కూడా రవితేజ మాస్ ఇమేజ్ కి తగ్గట్టే కథలు తయారు చేస్తున్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే హీరోలలో రవితేజ మాత్రమే ఉన్నాడనడంలో సందేహం లేదు.
గత చిత్రం భర్త మహాశయులకువిజ్ఞప్తి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. హీరోయిన్స్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్‌ల క్యారెక్టర్స్ గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మెన్ కూడా ఉంది. కానీ, కథే పరమ రొటీన్ కావడంతో ఫ్లాప్ తప్పలేదు. దాంతో, ఈసారి ఇంకాస్త డిఫరెంట్ జోనర్ సినిమాను చేస్తున్నాడు మన మాస్ మహారాజ్. ఇరుముడి పేరుతో ఇది తెరకెక్కుతోంది.
తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా కథ సాగుతుందట. ప్రియా భవానీశంకర్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్నుకోరి, మజిలీ, ఖుషి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇరుముడి టైటిల్ అలాగే రవితేజ గెటప్ చూసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం మేరకు..ఫస్టాఫ్ అంతా రవితేజ మార్క్ యాక్షన్ అండ్ మాస్ గా ఉంటుందట.
ఇంట్రడక్షన్ సీన్ హై ఓల్టేజ్ యాక్షన్ మోడ్ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. కానీ, పాప కోసం తనలోని కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని అయ్యప్ప దీక్ష తీసుకుంటాడట. అయితే, విలన్లు తన కూతురుని పెట్టే ఇబ్బందులకి తట్టుకోలేక మళ్ళీ, తన మాస్ అవతార్ లోకి వస్తాడని సమాచారం. చూడాలి, మరి దర్శకుడు శివ నిర్వాణ కూడా ఇలాంటి ప్రయోగం మొదటిసారి చేస్తున్నాడు. అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.












