National

రెండో స్వాతంత్ర్య పోరాటంలా పార్లమెంట్ మార్చ్: సోనమ్ వాంగ్​చుక్

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

దేశంలో నెలకొన్న భయాందోళనలు, అన్యాయాల నుంచి ప్రజలకు విముక్తి లభించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్​చుక్ పిలుపునిచ్చారు. జూలై 20న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను ఆయన భారతదేశపు రెండో స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు.

దేశంలో నెలకొన్న భయాందోళనలు, అన్యాయాల నుంచి ప్రజలకు విముక్తి లభించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్​చుక్ పిలుపునిచ్చారు. జూలై 20న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను ఆయన భారతదేశపు రెండో స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు. దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఈ నిరసనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్​జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్​చుక్.. తన భార్య గీతాంజలి ద్వారా శనివారం ఒక కీలక సందేశాన్ని పంపారు. స్వయంగా తన చేతులతో రాసిన ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్ష పేపర్ల లీకేజీల వంటి అన్యాయాలపై సమాజం గొంతు విప్పాలని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వాలు అక్రమంగా నిర్బంధిస్తున్నాయనే భయాన్ని వీడి, హక్కుల కోసం పోరాడాలని ఆయన దేశ ప్రజలకు హితవు పలికారు.

జంతర్ మంతర్ వేదికగా తాను శాంతియుతంగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అప్రజాస్వామికంగా భగ్నం చేశారని వాంగ్​చుక్ ఆరోపించారు. తన ఇష్టానికి పూర్తి విరుద్ధంగా, బలవంతంగా సఫ్దర్​జంగ్ ఆసుపత్రికి తరలించి అక్కడ ఉంచడాన్ని ఆయన 'అక్రమ నిర్బంధం'గా పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఈ నిర్బంధాలే తమ పోరాట పటిమను మరింత పెంచుతాయని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీలు, సీబీఎస్​ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పూర్తి జవాబుదారీతనం వహించాలని, విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతోంది. ఈ డిమాండ్ల సాధన కోసమే జూలై 20న నిర్వహించే పార్లమెంట్ మార్చ్‌ను ఉధృతం చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
https://x.com/Wangchuk66/status/2078688447859159521?s=20

 

#SonamWangchuk#ParliamentMarch#NEETPaperLeak#ProtestDelhi#EducationReforms#DharmendraPradhanResign
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి