సినిమా

Tollywood: శర్వానంద్ @ 80 కోట్లు.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్..!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, విలక్షణమైన కథలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మీడియం బడ్జెట్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లేదా లవ్ స్టోరీస్‌తో సేఫ్ జోన్‌లో దూసుకుపోయే ఈ హీరో, ఇప్పుడు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tollywood: టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, విలక్షణమైన కథలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మీడియం బడ్జెట్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లేదా లవ్ స్టోరీస్‌తో సేఫ్ జోన్‌లో దూసుకుపోయే ఈ హీరో, ఇప్పుడు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయినా, శర్వా ఇంత పెద్ద రిస్క్ చేయడం ఆయనకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను విజువల్ వండర్స్‌ను తెరకెక్కించడంలో దిట్టగా పేరొందిన నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్నారు. 'నాగబంధం' వంటి అడ్వెంచర్ థ్రిల్లర్‌తో టెక్నికల్ స్టాండర్డ్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఆయన, ఈసారి శర్వానంద్ సినిమా కోసం ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యార‌ని టాక్ న‌డుస్తోంది. శర్వానంద్ మార్కెట్ పరిధిని దాటి మరీ చేస్తున్న ఈ సినిమా, ఖచ్చితంగా ఆయన కెరీర్‌కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కడానికి ప్రధాన కారణం దీని కథాంశమే. భారతీయ మహా పురాణం ‘మహాభారతం’ లోని ఒక అత్యంత ఆసక్తికరమైన ఘట్టాన్ని బేస్ చేసుకుని, దానికి నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. పౌరాణిక స్పర్శ ఉన్న ఈ యాక్షన్ డ్రామాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసం బడ్జెట్‌లో సింహభాగం కేటాయించనున్నట్లు సమాచారం.

అయితే ఈ 80 కోట్ల రిస్క్‌ను బ్యాలెన్స్ చేయడానికి మేకర్స్ ఒక పక్కా ప్లాన్ వేశారు. ఇది కేవలం శర్వానంద్ సోలో మూవీ మాత్రమే కాదు.. ఇదొక భారీ మల్టీస్టారర్ చిత్రం అట‌. శర్వాతో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో క్రేజీ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవబోతున్నారు. ఆ స్టార్ హీరో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరుగుతుంద‌ట‌. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఆ రెండో హీరో ఎవరనే సస్పెన్స్‌కు మేకర్స్ త్వరలోనే అధికారికంగా తెరదించనున్నారు.

#Sharwanand#Tollywood#AbhishekNama#Nagabandham
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి