Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘జైలర్ 2’ కూడా ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’లో రజినీకాంత్ మాస్ స్వాగ్, కామెడీ, యాక్షన్‌తో పాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో రెండో భాగంలో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా, ఈ సినిమా నుంచి బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ డాన్స్ నంబర్ రిలీజైంది.
అయితే, ‘జైలర్ 2’కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆసక్తికరమైన టాక్ ఒకటి వైరల్ అవుతోంది. సినిమాలో స్పెషల్ సాంగ్స్, ఐటమ్ నంబర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, స్టార్ హీరో సినిమా అంటే మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్రత్యేక పాటలు ఉండటం సహజమే. అయితే, ‘జైలర్ 2’లో మాత్రం వీటి సంఖ్య ఎక్కువగా ఉండబోతుందనే వార్తలు ఫ్యాన్స్‌లో చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల, జైలర్2లో మొత్తం 12 పాటలున్నట్టుగా పోస్టర్ ద్వారా వెల్లడించారు.
అప్పుడు తమన్నా..ఇప్పుడు పూర్ణ, నోరా..
రజినీ నటించిన 'జైలర్' సినిమాలో 'కావాలా...నువు కావాలయ్యా అంటూ తమన్నా బెల్లీ డాన్స్‌తో అందరినీ ఒక ఊపు ఊపేసింది. ఈ డాన్స్ నంబర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక, ఇప్పుడు అదే స్థాయిలో నోరా ఫతేహి డాన్స్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ కంటే ముందు పూర్ణ స్పెషల్ నంబర్ వచ్చింది. ఈ పాట కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, తమన్నా కాకుండా పూర్ణా ఈ సాంగ్ చేయడం ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ, తాజాగా..ఇదే జైలర్2 నుంచి నోరా ఫతేహి డాన్స్ నంబర్ చూసి మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా అక్టోబర్ 15న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సంగ్ పిక్చర్స్ పతాకంపై, కళానిధి మారన్ నిర్మించారు.
మన సౌత్ సినిమాలలో సీక్వెల్ మూవీస్ కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మరి, రజినీకాంత్ నటించిన జైలర్ 2 సీక్వెల్ మొదటి పార్ట్ కంటే భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది..అక్టోబర్ 15న మాత్రమే తేలిపోనుంది. ఏమాత్రం కథ జైలర్ మాదిరిగా ఉంటే..ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. చూడాలి, మరి దర్శకుడు నెల్సన్ ఏం ప్లాన్ చేశాడో. ఇక, ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి, మిర్న మీనన్, రమ్య కృష్ణన్, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.


