సినిమా

Rajamouli: బాహుబలి 3, ఆర్ఆర్ఆర్ 2 కథలు సిద్ధమయ్యాయా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మహేష్ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. అయితే, అభిమానుల్లో మాత్రం మరో రెండు ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.

Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మహేష్ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. అయితే, అభిమానుల్లో మాత్రం మరో రెండు ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి..‘బాహుబలి 3’ ఎప్పుడు వస్తుంది? రెండోది ‘ఆర్ఆర్ఆర్ 2’ కథ సిద్ధమైందా?

బాహుబలి 3పై క్లారిటీ..

‘బాహుబలి’ రెండు భాగాలతో ప్రేక్షకులకు ఓ పూర్తి కథను అందించారు రాజమౌళి. దీంతో ప్రభాస్, రానా అభిమానులు ఎప్పటి నుంచో మూడో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య షోలో సరదాగా బాహుబలి 3 కి డేట్స్ అడిగాడు జక్కన్న. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ‘బాహుబలి 3’ లైవ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించే ప్రణాళిక లేదట. నిర్మాత శోబు యార్లగడ్డ కూడా గతంలో ఇదే విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ‘బాహుబలి’ ప్రపంచాన్ని మాత్రం ఇతర ఫార్మాట్లలో కొనసాగించే ఆలోచన ఉందని చెప్పారు.

ఇక, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రావాలంటూ అభిమానుల నుంచి భారీ స్థాయిలో జక్కన్నకి రిక్వెస్టులు వచ్చాయి. దీనిపై స్వయంగా రాజమౌళి స్పందిస్తూ.. తన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్ 2’ కథపై పని చేస్తున్నారని 2022లో వెల్లడించారు. మేము ఈ సీక్వెల్ గురించి చర్చించామని కూడా చెప్పారు.

అయితే, ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్ 2’పై అధికారికంగా పెద్దగా ముందడుగు పడినట్లు సమాచారం లేదు. ప్రస్తుతం రాజమౌళి పూర్తిగా తన ‘వారణాసి’పై దృష్టి పెట్టారు. కాబట్టి, ‘ఆర్ఆర్ఆర్ 2 కథ పూర్తిగా సిద్ధమైపోయింది, త్వరలో సినిమా మొదలవుతుంది’ అని చెప్పడానికి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం లేదు. కానీ, జక్కన్న తలుచుకుంటే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇది మాత్రం పక్కా.

#Rajamouli#Bahubali 3#RRR 2#Prabhas-Rana#NTR-CHARAN
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి