తెలంగాణ

BRS : ఏం బూతులు.. ఏం భాష.. సీఎం రేవంత్‌కు ‘గంగుల’ కౌంటర్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ముందుగా కరీంనగర్‌లో పర్యటించిన సీఎం అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లారు.

సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ముందుగా కరీంనగర్‌లో పర్యటించిన సీఎం అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లారు. అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే.

నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు వస్తున్నారంటే ఆశపడ్డాం. గత పదేళ్లలో కెసీఆర్ కరీంనగర్‌కు వచ్చినప్పుడల్లా నిధుల వరద పారింది. అలాగే రేవంత్ రెడ్డి వస్తుంటే అదే మాదిరిగా ఉంటుంది అనుకున్నాం.

కానీ, ఆరోపణలు, విధ్వంసం..వ్యక్తిగత విమర్శలు తప్ప ఏం లేదు. 1000 రోజుల పాలనలో ప్రశ్నిస్తే డైవర్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. చాలా ముఖ్యమంత్రలను చూశాం. కానీ, ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదు..ఏం బూతులు, ఏం బాషా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన కలెక్టరేట్ కేసీఆర్ కట్టించారని, దానికి తానే భూమి పూజ చేశానని మాజీ మంత్రి వెల్లడించారు.

కరీంనగర్‌కు కేబుల్ బ్రిడ్జి, రివర్ ఫ్రంట్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పారు. కానీ, మూడేళ్లలో మీరు ఇచ్చింది ఏంది? వాటిని ఏం చేశారు అని నిలదీశారు. ‘కేంద్రమంత్రి బండి సంజయ్ పక్కనే ఉన్నాడు. రైల్వే బ్రిడ్జి ఐదేళ్లుగా అలాగే ఉంది. నిర్మాణ పనులు ఎందుకు ఆగాయి అని అడిగినవా రేవంత్’ అని ప్రశ్నించారు. కనీసం రివ్యూ చేయలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఇన్నేళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారుడు భాష మాట్లాడలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.

#BRS#ex minister gangula kamalakar#congress#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి