అభిప్రాయం

Viral : ‘అన్నా ఆకలేస్తుంది.. ఇంటికి తీసుకెళ్లండి’ బోరున ఏడ్చేసిన పిల్లాడు!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఏపీలో హృదయాన్ని కలిచివేసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బాలుడు మేకలు కాస్తూ తిరుగుతుండగా.. అతన్ని పలకరించిన వ్యక్తులకు తన గోడును చెప్పుకోని కంటతడిపెట్టాడు. ఏడుస్తూ తన బాధను చెప్పుకోగా ఆ వ్యక్తుల నోటి వెంట మాట రాలేదని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీలో హృదయాన్ని కలిచివేసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బాలుడు మేకలు కాస్తూ తిరుగుతుండగా.. అతన్ని పలకరించిన వ్యక్తులకు తన గోడును చెప్పుకోని కంటతడిపెట్టాడు. ఏడుస్తూ తన బాధను చెప్పుకోగా ఆ వ్యక్తుల నోటి వెంట మాట రాలేదని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అన్నా ఆకలేస్తుంది ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ ఆ బాలుడు కంటతడి పెట్టుకున్నాడు. సుమారు 8 ఏళ్ల వయస్సులో అతను పడుతున్న కష్టాన్ని చూసిన వారంతా అయ్యో పాపం..అంటున్నారు. వివరాల్లోకివెళితే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో రామయ్య అనే బాలుడుమేకలు మేపుతూ కనిపించాడు. అప్పటికే ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న రామయ్యను ఇద్దరు వ్యక్తులు గమనించారు.

అతని వద్దకు వెళ్లి పలకరిస్తే ఆకలిగా ఉందని, ఇంటికి తీసుకెళ్లండని బోరున ఏడ్చేశాడు. తనకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని, చాలా ఆకలేస్తోందంటూ కన్నీరుమున్నీరయ్యాడు. నర్రవాడ గ్రామానికి చెందిన తనను తన తల్లే పనిలో పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. రాచవారిపాలెంలో ఉన్న వృద్ధుల్ని చూసుకుంటూ గొర్రెలు మెపే పనిలో పెట్టారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

తన తల్లి వద్దకు వెళ్లి తనని తీసుకెళ్లమని చెప్పమనండి అంటూ రామయ్య కన్నీటిపర్యంతం అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దానిని వీక్షించిన వారంతా బాలుడ్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి ఆకలితో అలమటించేలా చేయడం నేరమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వలన బాలుడికి ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని కొందరు స్పందిస్తుండగా.. వారి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి బాలుడికి విముక్తి కల్పించాలని, చదువు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

#minor boy#goat farming#Andrapradesh#child labour#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి