National

Rahulgandi : ఎస్ఐఆర్ వివాదం.. ‘ఫారమ్ -6’ ఉపసంహరణ వెనుక ఎవరున్నారు? : రాహుల్ గాంధీ

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మీద తీవ్రదుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే ఓట్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుకుంటుందని, ప్రతిపక్షపార్టీల అనుకూల ఓట్లను డిలీట్ చేస్తుందని పొలిటికల్ పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మీద తీవ్రదుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే ఓట్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుకుంటుందని, ప్రతిపక్షపార్టీల అనుకూల ఓట్లను డిలీట్ చేస్తుందని పొలిటికల్ పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలు, నాయకులు ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజీనామా కోరుతూ రేపటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి దేశవ్యాప్త పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఫారమ్-6(తాతముత్తాలకు సంబంధించిన పత్రాలు)అడగటాన్ని ఉపసంహరించకుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆన్‌లైన్ ఫారం-6ను చట్టవిరుద్ధంగా మార్చారు? ఈసీ సొంత కమిషనర్లే ఈ విషయంపై అభ్యంతరం తెలిపారు. ఈసీఐలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఆ మార్పు చేయమని ఎవరు ఆదేశించారు? టీసీఎస్‌లో ఎవరు దానికి ఆమోదం తెలిపారు? అలా చేయడానికి వారిపై ఒత్తిడి తెచ్చారా? అని గాంధీ గురువారం ‘ఎక్స్’ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు

అయితే, ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇకమీదట ఫారం-6కు అదనంగా డిక్లరేషన్ ఫారం కోరడాన్ని ఈసీ అధికారికంగా ఉపసంహరించుకుంది. ఎస్ఐఆర్ సందర్భంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు తమ తండ్రి, తాతల పేర్లను వెల్లడించాలని పేర్కొనేవారు. ‘ఫారం-6’కు అదనంగా డిక్లరేషన్‌ను ఈసీ జోడించింది. ఎస్ఐఆర్ సందర్భంగా తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఇద్దరు కమిషనర్లు ఎస్‌ఎస్‌ సంధూ, వివేక్‌ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ఓ మీడియాలో పత్రిక కథనం రావడంతో అది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాగా, 26న సమావేశమైన ఈసీ.. ఎస్ఐఆర్ కోసమే ఈ ఫారాన్ని తెచ్చామని తెలిపింది. ఎస్ఐఆర్ అమలులోలేని సమయంలో 1960 నాటి ఓటరు నమోదు నిబంధనలకు అనుగుణంగా ఫారం-6ను నింపితే చాలని పేర్కొంది. అంతేకాకుండా ఎస్ఐఆర్ ముగిసిన ప్రాంతాల్లో ఈసీఐనెట్ పోర్టల్,యాప్‌లతో పాటు సీఈఓ వెబ్‌సైట్ల నుండి కూడా ఈ డిక్లరేషన్‌ను తొలగించామని పేర్కొంది.కాగా, ఆన్‌లైన్‌లో ఫారం -6 ఉపసంహణ కోసం ఎవరు ఆదేశాలు ఇచ్చారని తాజాగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు.మరి దీనికి సీఈసీ సమాధానంఏం చెబుతుందో వేచిచూడాల్సిందే.

#SIR#form -6#removed#CEC#Rahulgandi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి