Tollywood: మన టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ‘వారణాసి’, ‘డ్రాగన్’. సూపర్‌స్టార్ మహేష్ బాబు–దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’పై అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే, గత కొన్ని రోజుల నుంచి ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో రక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నిర్మాత రవి శంకర్.వై ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది.
మహేష్ ‘వారణాసి’ విడుదలపై రాజమౌళి క్లారిటీ..
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళిని ‘వారణాసి’ రిలీజ్ గురించి నేరుగా ప్రశ్నించారు. ఏప్రిల్ 7న సినిమా వస్తుందా? అని ఎన్టీఆర్ అడగగా.. రాజమౌళి ‘తప్పకుండా’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రావడం ఖాయమని తేలిపోయింది.
కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే, ప్రధాన యాక్షన్ సన్నివేశాల్లో ఎక్కువ భాగం పూర్తయినట్లు రాజమౌళి వెల్లడించారు. ఏప్రిల్ 7, 2027 రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని గతంలోనే ఆయన స్పష్టం చేసిన జక్కన్న..ఇప్పుడు మరోసారి డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్ డేట్‌లో మార్పు లేదు..
ఇక, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ విషయంలో కూడా నిర్మాత రవి శంకర్ కీలక ప్రకటన చేశారు. షూటింగ్‌లో ఆలస్యం, ఎన్టీఆర్‌కు గాయం కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను తీసుకొస్తామని నిర్మాత స్పష్టం చేశారు. ‘డ్రాగన్’ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్‌లో కూడా నిర్మాత రవి శంకర్.. షూటింగ్‌ను పూర్తి చేసి ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. మొత్తానికి, ఒక చిన్న సినిమా ఈవెంట్‌కి గెస్టులుగా హాజరైన రాజమౌళి, రవి శంకర్ రెండు పాన్ ఇండియా సినిమాల విడుదలపై క్లారిటీ ఇవ్వడం గొప్ప విషయం.


