Allu Arjun: మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యువ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని మేకింగ్ వీడియోస్‌తో అర్థ మైంది. ముఖ్యంగా, అట్లీ మార్క్ భారీ యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తుందట.
తాజాగా, ‘రాకా’ సినిమాకు సంబంధించి ఈ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. చిత్ర కథ పరిధి, భారీ స్కేల్, పాత్రల విస్తృతి, హెవీ కాస్టింగ్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
తమిళ దర్శకుడు అట్లీ సినిమాల్లో కథతో పాటుగా కమర్షియల్ ఎలివేషన్స్, ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ‘రాకా’ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్న నేపథ్యంలో కథను ఒక్క భాగంలో పూర్తిచేయడం కష్టమవుతుందనే చర్చ ఇప్పుడు యూనిట్ సభ్యులలో జరుగుతోంది.
అయితే, రెండు భాగాలుగా సినిమా వస్తుందనే విషయం గురించి మాత్రం ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో, ఇది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్ వార్తగానే భావిస్తున్నారు. కానీ, పుష్ప తరహాలోనే రాకా కూడా రెండు భాగాలుగా చేసేందుకు స్కోప్ ఉంది. దీపిక పడుకొనె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్నలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచార. అధికారికంగా మాత్రం దీపిక మాత్రమే రివీల్ అయింది. కాగా, ముంబైలో వేసిన భారీ సెట్స్‌లోనే రాకా రెండు భాగాల సీన్స్‌ను పూర్తి చేస్తున్నారట. మరి, ఇది అఫీషియల్‌గా ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.


