తెలంగాణ

జగన్, మమత సొంతగూటికి రండి : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

దేశంలో సమగ్ర ఓటరు జాబితా(ఎస్ఐఆర్)పేరిట లక్షల ఓట్లు డిలీట్ చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.నిన్న మధ్యాహ్నం కేరళం కొచ్చిలో నిర్వహించిన ఇండియా టు టే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.

దేశంలో సమగ్ర ఓటరు జాబితా(ఎస్ఐఆర్)పేరిట లక్షల ఓట్లు డిలీట్ చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.నిన్న మధ్యాహ్నం కేరళం కొచ్చిలో నిర్వహించిన ఇండియా టు టే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాలు, మతాలను సమైక్యంగా ఉంచి అభివృద్ధి పథంలో నడిపించే విజన్ ఒక్క కాంగ్రెస్‌కే ఉందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మమతా బెనర్జీ, శరద్‌పవార్ సహా పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు.

ఓటు చోరీ జరిగిందని ప్రజలు అనుమానిస్తున్న వేళ ఎన్నికల సంఘం పారదర్శకత మీద కేంద్రం ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసే పనిచేస్తామని డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు.సీఎం రేవంత్‌ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలను అమలు చేయడానికి సీఎంతో పాటు సహచర మంత్రులందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. పార్టీలో పనిచేసే నాయకులను తాను కులం ప్రాతిపదికన చూడనని, పార్టీ అధిష్టానం ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారని వెల్లడించారు.

‎కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో ఎన్నికల సంఘాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ.. తమకు విపరీతమైన ప్రజాదరణ ఉన్నచోట 30 వేల నుంచి 40వేల ఓట్లు తొలగించినప్పటికీ మెజారిటీ తగ్గి గెలుస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు లేదా గెలవవచ్చు.. కానీ, పౌరులకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విశ్వాసం సడలకుండా చూడటమే ముఖ్యమన్నారు. తాము వేస్తున్న ఓటు ఎవరికి వెళ్తుందనే అనుమానం ఓటర్లకు వచ్చినప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేసి పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉందన్నారు.

సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారో ముందే గుర్తించి కేంద్రీకృత పద్ధతిలో ఫారమ్-7 దరఖాస్తుల ద్వారా ప్రతిపక్షపార్టీ మద్దతుదారుల పేర్లను తొలగిస్తున్నారని భట్టి ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరిట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 40 వేల నుంచి 50వేల వరకు ఓట్లను అక్రమంగా డిలీట్ చేస్తున్నారని చెప్పారు. తన సొంత నియోజకవర్గంతో సహా మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు పోటీదారుల పేర్లను కూడా ఓటర్ల జాబితాలో అనుమానాస్పదంగా పేర్కొన్నారని వెల్లడించారు.

#deputy cm batti vikramarka#congress#india today conclave-2026#kochi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి