తెలంగాణ

KTR : బీజేపీతో పొత్తు ఉండదు.. రెండేండ్లలో కేసీఆరే సీఎం : కేటీఆర్

రచన: Kumar••5 నిమిషాల పఠనం

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భావజాలం, సైద్ధాంతికంగా తాము బీజేపీకి వ్యతిరేకమని.. అలాంటప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు. నిన్న సాయంత్రం కేరళంలో నిర్వహించిన ‘ఇండియా టుడే’ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..26ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో తాము పొత్తు పెట్టుకోలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భావజాలం, సైద్ధాంతికంగా తాము బీజేపీకి వ్యతిరేకమని.. అలాంటప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు. నిన్న సాయంత్రం కేరళంలో నిర్వహించిన ‘ఇండియా టుడే’ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..26ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో తాము పొత్తు పెట్టుకోలేదన్నారు. గత మూడు జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసిందని పేర్కొన్నారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం నుంచి 19 శాతానికి తగ్గిందని, ఇప్పుడు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

అస్సాం, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచారని.. ఏపీ, తెలంగాణలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదనే అనుమానం రేకెత్తుతుందన్నారు.రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ (రీకాల్, రీగ్రెట్, రీవోల్ట్) పరిస్థితి కనిపిస్తున్నదని కేటీఆర్ అన్నారు. 2023ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చడంపైనా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నేను షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకుంటే షారుఖ్ ఖాన్ అయిపోతానా?.. కేవలం పేరు మారినంత మాత్రాన పార్టీ సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఏమాత్రం మారవు’అని స్పష్టంచేశారు.

మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రజలు ఆరాధించే రాముడు, శివుడి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీల విధానం అదే అన్నారు. ఉద్యోగాల కల్పన, ఎన్నికల టైంలో బీజేపీ ఇచ్చిన హామీల అమలుపై చర్చించకుండా, ఇరు పార్టీలు ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

సీఈసీ మీద అన్ని ఆరోపణలు వచ్చిప్పుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం మీద వచ్చిన ఇన్వెస్టిగేషన్ కథనాన్ని చాలా మంది నిజం అని భావిస్తున్నారని, దీనిని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ జరపాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని, సీజేపీ, స్టూడెంట్స్, జెన్ జీ అందుకే రోడ్ల మీదకు వస్తున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడని తెలిపారు.

#KTR#India today conclave#kochi#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి