సిరిసిల్ల సభలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు, ఉపయోగించిన పదజాలంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్మమంత్రి సభకు జనాలను తీసుకొచ్చేందుకు కిందిస్థాయి జిల్లా నేతలు తీవ్రఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గురువారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మీదల తీవ్ర విమర్శలు గుప్పించారు.
సిరిసిల్ల సభకు 10, 15 జిల్లాల నుంచి జనాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతుల అంశం, నీళ్ల అంశం మాట్లాడుతారని అనుకున్నామని.. కానీ, ఆయనకు రాజకీయాలే ప్రాధాన్యత అని తెలిసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై కడుపులో విషం నింపుకొని మాట్లాడినట్టు అర్ధం అవుతోందని అన్నారు.ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.
అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ కేసీఆర్‌కు 67 ఎకరాల వ్యవసాయ భూమిని ఉందని అన్నారని, గతంలో 700 ఎకరాలు ఉందని ఆరోపించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రమే కాదని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసిన అప్పుల గురించి కూడా చెప్పాలని ప్రశ్నించారు. గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని, సిరిసిల్లను కూడా కూడా కేటీఆర్ అభివృద్ధి చేసి చూపించారని అన్నారు.
విద్యార్థుల కోసం కలశాలలు నెలకొల్పి విద్యార్థులకు విద్య అందించారని, సిరిసిల్లను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ‘వర్కర్ టు ఓనర్’ స్కీమ్ ఎందుకు ఆగిపోయింది రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ‘నీకు జ్ఞానం ఉందా? నేత కార్మికులని మోసం చేశావు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి విరుచకపడ్డారు.
ఇదిలాఉండగా, నిన్న సభలో సీఎం మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో కేవలం 172 ఓట్లతో సిరిసిల్లలో కేటీఆర్ గెలిచారని, ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల మేర భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం అన్నారు. అమెరికాలో అంట్లు తోమి.. హోటళ్ళలో చిప్పలు కడిగిన వాడికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? అంటూ సీఎం ప్రశ్నించారు. దాదాపు 6 సార్లు సిరిసిల్లో కేటీఆర్‌ను గెలిపించినా ఇక్కడి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని, గల్ఫ్ దేశాలకు వలసలు ఎందుకు తగ్గలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. విదేశాలకు వెళ్లిన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను అందరం చూస్తున్నామని, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు సిరిసిల్ల ప్రజలకు ఏం చేశారో ఆలోచించుకోవాలో సూచించారు.


