National

Railway Jobs: డిగ్రీ ఉంటే చాలు.. రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Railway Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తీపి కబురు చెప్పింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన యువత కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 1,250 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ఈ పోస్టులను సాధారణ NTPC నుంచి వేరుచేసి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం విశేషం.

Railway Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తీపి కబురు చెప్పింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన యువత కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 1,250 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ఈ పోస్టులను సాధారణ NTPC నుంచి వేరుచేసి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం విశేషం.

అర్హతలు, జీతం వివరాలు:

ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు పే లెవల్-6 కింద బేసిక్ పే రూ.35,400తో పాటు ఇతర రైల్వే అలవెన్సులు అందుతాయి.

సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాలు..

సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా సహా దేశంలోని పలు ప్రధాన రైల్వే బోర్డుల పరిధిలో ఈ 1,250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష (CBT) 100 మార్కులకు 120 నిమిషాల సమయం ఉంటుంది. ఇందులో బేసిక్ సైన్స్ , మ్యాథ్స్ నుంచి 60, లాజికల్ ఎబిలిటీ నుంచి 20, మెంటల్ రీజనింగ్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారి నుంచి ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున ఆప్టిట్యూడ్ పరీక్షకు పిలుస్తారు. మెడికల్ రూల్స్ ప్రకారం స్టేషన్ మాస్టర్ పోస్టులకు కంటి చూపు చాలా ముఖ్యం. దూరపు చూపు 6/9, దగ్గరి చూపు Sn-0.6 ఉండేలా మెడికల్ ఫిట్‌నెస్ ఉండాలి.

దరఖాస్తు గడువు:

ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమై నవంబర్ 25తో ముగుస్తాయి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్ [https://rrb.indianrailways.gov.in](https://rrb.indianrailways.gov.in) ను పరిశీలించవచ్చు.

#Railway Jobs#Railway Jobs 2026#Railway Recruitment 2026#Indian Railways Recruitment#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి