సినిమా

Tollywood: ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించి ఇప్పట్లో మాట్లాడకపోవడం మంచిదా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Tollywood: కొన్ని కాంబినేషన్ కుదరాలని అభిమానులే కాదు..ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కోరుకుంటారు. అంతేకాదు, కొందరు హీరోలతో సినిమా చెయ్యాలనే తాపత్రయం, ఆరాటం కొందరు దర్శకులకీ ఉంటుంది. కానీ, అంత సులభంగా ఈ కాంబినేషన్స్ కుదరవు. ఇప్పుడు, ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించే. దీనికి కారణం స్వయంగా గురూజీ ఈ టాపిక్ తీసుకురావడమే.

Tollywood: కొన్ని కాంబినేషన్ కుదరాలని అభిమానులే కాదు..ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కోరుకుంటారు. అంతేకాదు, కొందరు హీరోలతో సినిమా చెయ్యాలనే తాపత్రయం, ఆరాటం కొందరు దర్శకులకీ ఉంటుంది. కానీ, అంత సులభంగా ఈ కాంబినేషన్స్ కుదరవు. ఇప్పుడు, ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించే. దీనికి కారణం స్వయంగా గురూజీ ఈ టాపిక్ తీసుకురావడమే.

ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా ఇప్పట్లో ఉండదని చాలామందికి తెలుసు. కానీ, ఎక్కడో చిన్న ఆశ. ఈ కాంబో కుదురుతుందని. తాజాగా, జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి గెస్ట్‌గా వచ్చాడు త్రివిక్రమ్. ఈ సందర్భంగా, సునీల్..థమన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, త్రివిక్రమ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. వీటిలో, తారక్ సినిమా గురించి చెప్పడం కాస్త అభిమానులకి ఉత్సాహన్నిచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందని..ఇప్పటికే, ఫైనల్ నరేషన్ కూడా తారక్‌కి చెప్పినట్టుగా రివీల్ చేశాడు.

ఇక, ప్రభాస్‌లో మంచి హ్యూమర్ ఉందని..యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు మంచి కామెడీ కూడా చేయించవచ్చునని..బుజ్జిగాడు సినిమాలో పూరి బాగా చూపించాడని..కానీ, అంతకన్నా ప్రభాస్‌ను బాగా చూపించవచ్చుననే విషయాన్ని త్రివిక్రమ్ చెప్పాడు. ఆ అవకాశం కోసం ప్రయత్నించానని కూడా వెల్లడించాడు. ఆ సత్తా ఉన్న దర్శకుడు కూడా ఖచ్చితంగా గురూజీనే. ఆయన, పంచెస్‌కి ప్రభాస్ టైమింగ్‌కి సూపర్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ, త్రివిక్రమ్, ప్రభాస్ కాంబోలో సినిమాను ఆశించడం మాత్రం అత్యాశే అవుతుంది.

ప్రభాస్ లైనప్‌లో లేని త్రివిక్రమ్!

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఆల్రెడీ రెండు సెట్స్ మీదున్నాయి. ఫౌజీ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన డార్లింగ్..తాజాగా, వెకేషన్ కోసం ఫ్రెండ్స్‌తో విదేశాలకి వెళ్ళాడు. వారం-పదిరోజుల తర్వాత వచ్చి నాన్ స్టాప్‌గా స్పిరిట్ మూవీ షూట్‌లో పాల్గొంటాడు. ఈ సినిమా పూర్తి చేస్తూనే, కల్కీ 2 షూట్‌లోనూ జాయిన్ కావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత 2027 జూలై నుంచి అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే సలార్ 2 సెట్స్‌పైకి వస్తుంది.

ఈ లైనప్ మొత్తం పూర్తవ్వాలంటే 2028 దాటిపోతుంది. ఇక, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం సినిమాను ఈ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత తారక్ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవుతారు. 2027 సమ్మర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నిబట్టి చూస్తే 2029 వరకూ త్రివిక్రమ్-ప్రభాస్ కాంబో కోసం ఎదురుచూడాలి. ఆ తర్వాతైనా అవకాశం ఉంటుందా అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది.

#Prabhas#Trivikram#Tollywood#Latest Cinema Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి