Prashanth Neel: ఒక సినిమా పదే పదే వాయిదా పడుతుంటే ప్రేక్షకులోనే కాదు సినీ వర్గాలలోనూ ఆసక్తి తగ్గిపోవడం సహజం. సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా..టెక్నికల్‌గా ఎలాంటి స్ట్రాంగ్ టీమ్ ఉన్నా బిజినెస్ పరంగా కూడా అంచనాలన్నీ తారుమారవడం కామన్. కాస్తో కూస్తో వచ్చిన హైప్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు, 418 మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సెప్టెంబర్ 18 రిలీజ్ కావాల్సిన మూవీ మళ్ళీ వాయిదా పడింది.
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన కన్నడ చిత్రం '418'. రీసెంట్‌గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టింది. ఇటీవల వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలలో అత్యంత భయాన్ని కలిగించే సినిమా మాదే అన్నట్టుగా మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి.. కథను కూడా ఆయనే రాశారు.
ఇందులో చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అట్మాస్ఫెరిక్ విజువల్స్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ బ్యాక్ గరుండ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గొప్ప హారర్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందని మేకర్స్ నమ్మకంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమా జూలై 31నే విడుదలవ్వాల్సింది. కానీ, ఆఖరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు.
మళ్ళీ, ఈ మధ్య సెప్టెంబర్ 18న 418 సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు మళ్ళీ విడుదల వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇలా, ఒక సినిమాను పదే పదే విడుదల వాయిదా వేస్తుంటే..ప్రేక్షకుల్లో ఇదేదో పస లేని సినిమాలా ఉందని ఆసక్తి తగ్గిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాపైనే ఈమధ్య జనాలలో పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. ఇక, చిన్న చిత్రంగా వస్తోన్న 418 పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి, మళ్ళీ కొత్త తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో..ప్రేక్షకుల్లో ఆసక్తిని ఎలా రేకెత్తిస్తారో చూడాలి.










