Srikanth Odela: ఇండస్ట్రీకి కొత్త దర్శకులు వస్తున్నారంటే ఇప్పుడు కేవలం సినిమా తీయడం ఒక్కటొస్తే సరిపోదు. కథను జనాలకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి..హీరో ఇమేజ్‌కి తగ్గట్టు ఎలాంటి కథ రాయాలి..దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చెయ్యాలి..ఏ ఏ అంశాలను జోడిస్తే బిజినెస్ జరుగుతుంది..ఇలాంటి చాలా ఉంటాయి. కానీ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం మొదటి సినిమాకి ఇవేవీ తెలియకుండా డైరెక్షన్ చేశాడు.
తాజాగా, ఈ విషయాన్ని ఆయనే చెప్పడం విశేషం. నానితో చేస్తున్న రెండవ సినిమా ది ప్యారడైజ్. మొదటి సినిమాను కూడా నానితో చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్ ని కూడా ఫైనల్ మూవ్‌మెంట్‌లో తీసేద్దామనుకున్నాడంటే..అది కూడా హీరోతోనే నేరుగా చెప్పాడంటే ఎంత అమాయకత్వమో అర్థం అవుతుంది. ఇక్కడ, చాలా లెక్కలుంటాయి. అదే, మాటకి ఇంకో హీరో అయితే, ముందు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చినందుకు ..వెంటనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనేవాడు.
కానీ, నానీ అలా కాదు..డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాడు కాబట్టి..ఒక దర్శకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నాడు. కాబట్టే, కీర్తి సురేష్ దసరాలో అద్భుతమైన రోల్ చేయగలిగింది. ఇప్పుడు, మరోసారి ఏషనాగుల అంటూ నానితో ప్యారడైజ్ సినిమాలో మాస్ స్టెప్పులేసింది. ఇక, ఈ సినిమా సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా శ్రీకాంత్..దసరా సినిమా తీసినప్పుడు ఏమీ తెలియదని..బిజినెస్ వ్యవహారాలన్నీ నాని, సుధాకర్ చెరుకూరి చూస్కున్నారని తెలిపాడు. కానీ, ప్యారడైజ్ కి మాత్రం బిజినెస్ వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు ఏం కోరుకుంటారు..వాళ్ళని ఎలా సంతృప్తి పరచాలి..ఇలాంటివి చూసుకునేటప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుంది..అనే అంశాలన్నీ తెలుసుకున్నట్టుగా చెప్పాడు. మొత్తానికి, మొదటి సినిమాకి ఏ నాలెడ్జ్ లేకపోయినా హిట్ కొట్టాడు. మరి, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ చేసిన ప్యారడైజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.









