సినిమా

Devi Sri Prasad: ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు పాతాళానికి తొక్కుతారో!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Devi Sri Prasad: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు పాతాళానికి తొక్కుతారో ఎవరూ ఊహించలేరు. సఖ్యత ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది. చిన్న తేడా వస్తే మాత్రం బలమైన బంధం మధ్య కూడా పగుళ్ళు ఏర్పడతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పరిస్థితి అలాగే ఉందనిపిస్తోంది. పుష్ప ఫ్రాంఛైజీస్ తర్వాత తెలుగులో చాలా వరకూ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి, కారణాలు చాలానే ఉన్నాయి.

ఏదేమైనా, ప్రస్తుతం డీఎస్పీ ఊపు మాత్రం బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో ఆయన హీరోగా నటించడం మరో పెద్ద ప్రయోగం. అదే ఎల్లమ్మ. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న దేవీ, సంగీత దర్శకుడిగానూ పనిచేస్తున్నాడు. చాలా వరకూ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు కాబట్టే కొత్త సినిమాలకి సంగీత దర్శకుడిగా ఒప్పుకోవడం లేదని వార్తలు ప్రసారం అవుతున్నాయి.

కానీ, కొందరేమో థమన్..అనిరుధ్ లతో పోటీ పడలేకపోతున్నాడు.. తన మార్క్ మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు. అందుకే, పుష్ప 2 కి కూడా బీజిఎం థమన్‌తో చేయించారని టాక్ వుంది. ఇక్కడి నుంచే దేవీ గ్రాఫ్ బాగా తగ్గిందని కూడా గమనించవచ్చు. ఇలాంటి సమయంలో వచ్చిన ఆఫర్ నాగార్జున మైల్ స్టోన్ మూవీ కింగ్ 100. ఈ సినిమా టాలీవుడ్ లో దేవి శ్రీ ప్రసాద్ కి చాలా కీలకంగా మారింది. మళ్ళీ, తన సత్తా చాటితే గానీ తెలుగులో అవకాశాలు రావని అంటున్నారు.

మరి, దేవీ ఈ విషయంలో ఎలాంటి ఛాలెంజ్ తీసుకుంటాడో చూడాలి. ఎల్లమ్మ సినిమాతో గనక హీరోగా సక్సెస్ అయినా..ఆ తర్వాత అదే ట్రాక్ కంటిన్యూ చేయడం కూడా కత్తి మీద సాముగా మారుతుంది. కానీ, మ్యూజిక్ డైరెక్టర్‌గా సాలీడ్ కంబ్యాక్ ఇస్తే మాత్రం మళ్ళీ ఫుల్ ఫాంలోకి రావడం ఖాయం. ఇప్పటికీ, సంగీత దర్శకుడిగా దేవీకి అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. కాస్త ఆశించిన అవకాశాలు రావడం లేదంటే. కింగ్ 100 తో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం.

#Devi Sri Prasad#King 100#Nagarjuna#Yellamma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి