Anu Emmanuel: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ సందడి చేసేది అతి కొద్ది కాలమే. 10 మందిలో ఇద్దరో ముగ్గురో ఓ పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా వెలగాలంటే అవకాశాలు వస్తే సరిపోదు. కాలం కూడా కలిసి రావాలి. అప్పుడే కొంతకాలం నిలబడతారు. లేదంటే గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ మాదిరిగా దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు, ఈ బ్యూటీ సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీ వదిలేసిందని టాక్ వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా కూడా బిగ్ స్టార్స్ పక్కన అవకాశాలు దక్కాయి. వాస్తవానికి, తెలుగు కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళంలో 'స్వప్న సంచారి' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. విదేశాలలో పుట్టి పెరిగిన అనూ..ఒకేసారి రెండు సినిమాలతో టాలీవుడ్‌కి పరిచయమైంది.
గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ అను ఇమ్మాన్యుయేల్ కమిటైన మొదటి సినిమా. ఆ తర్వాత నాని మజ్ఞు. కానీ, ముందు మజ్ఞు రిలీజైంది. ఇక, ఈ సినిమాల తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి, రాజ్ తరుణ్ సరసన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అల్లు అర్జున్ సరసన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు..అల్లు శిరీష్‌తో ఊర్వశివో రాక్షసివో లాంటి సినిమాలు చేసింది.
అయితే, అనూ ఇమ్మానియేల్ కెరీర్‌లో బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ దక్కింది గానీ, భారీ హిట్స్ మాత్రం దక్కలేదు. అదే ఆమె కెరీర్‌కి అతిపెద్ద మైనస్‌గా మారింది. ఆఖరిగా రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాలో కనిపించింది. హీరోయిన్‌గా అవకాశం వచ్చి దాదాపు 4 ఏళ్ళవుతోంది. దీంతో, ఇప్పుడున్న పోటీకి ఇక తనకి అవకాశాలు రావని డిసప్పాయింట్ అయి..ఇండస్ట్రీ వదిలి విదేశాలకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.









