The Paradise: నేచురల్ స్టార్ నటించిన ది ప్యారడైజ్ సాంగ్ టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్ఠించింది. ఎప్పుడు కూడా తెలంగాణ జానపదాలకి ఎంతో ఆదరణ లభిస్తుంది. అందుకే, గత కొంత కాలంగా తెలంగాణ సంసృతిని ప్రతిబింబించేలా సినిమాలలో పాటలను పెడుతున్నారు. ఈ క్రమంలోనే నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాలో ఏషనాగుల ఫోక్ సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కుతోంది.
ఇందులో, హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. ఇప్పటి వరకూ ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చింది రెండు పాటలు మాత్రమే. ఆ రెండు పాటలు తెలంగాణ ఫోక్ సాంగ్స్ కావడం విశేషం. మొదటి పాట జంగిరెడ్డి పాడిన ఆయా షేర్ కూడా సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఈ సాంగే యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిందనుకుంటే..ఇటీవల వచ్చిన ఏషనాగుల అంతకు నాలుగింతలు సంచలనం సృష్టించింది.
ఇప్పటి వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సాంగ్ కూడా ఇంత ఫాస్ట్‌గా 100 మిలియన్ వ్యూస్‌ని రాబట్టింది లేదు. అది, ప్యారడైజ్ సినిమాకే దక్కింది. ఇక, ఈ సాంగ్‌లో నాని-కీర్తి సురేష్ ఆడిపాడారు. ఆట సందీప్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. సాంగ్‌కి బీట్‌కి డాన్స్‌కి అసలు మ్యాచ్ అవలేదనే నెగిటివ్ టాక్ నుంచి 100 మిలియన్ వ్యూస్ వచ్చే క్రమంలో పాటపై విపరీతమైన పాజిటివిటీ పెరిగింది.

కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23నే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇంకా అధికారికంగా టికెట్ రేట్ల పెంపునకు సంబందించి ఎలాంటి కన్‌ఫర్మేషన్ రానప్పటికీ ఏపీ-తెలంగాణలలో గ్యారెంటీగా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు.









