తెలంగాణ

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా-మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే సంచలన సవాల్

రచన: NK3 నిమిషాల పఠనం

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. సభను తప్పుదోవ పట్టించారు అంటూ మంత్రి పొంగులేటిపై ఆయన మండిపడ్డారు. హైదర్‌నగర్‌ భూముల రిజిస్ట్రేషన్ల అంశంలో తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు.

Madhavaram Krishna Rao: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. సభను తప్పుదోవ పట్టించారు అంటూ మంత్రి పొంగులేటిపై ఆయన మండిపడ్డారు. హైదర్‌నగర్‌ భూముల రిజిస్ట్రేషన్ల అంశంలో తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. హైదర్ నగర్‌లోని 145, 163 సర్వే నెంబర్లలోని భూముల విషయంలో మంత్రి వాస్తవాలు చెప్పలేదన్నారు. మంత్రి పొంగులేటి చెప్పినట్లు ఆ భూములపై ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోలేదన్నారు. ఆ సర్వే నెంబర్లలోని భూములకు చాలా ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు కావట్లేదు అంటూ మంత్రి పొంగులేటి తప్పుదోవ పట్టించారని ఎమ్మెలే మాధవరం ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాదిపాటు రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

22ఏ పై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం కల్పిస్తే 22ఏ భూములపై పూర్తి ఆధారాలను సభ ముందు ఉంచి తన వాదనను నిరూపిస్తానని చెప్పారు. తాను చెప్పేది అబద్ధమని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

#Madhavaram Krishna Rao#Brs#Congress#Telangana#Kukatpally#Hydernagar#22A#Ponguleti Srinivas Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి