సినిమా

Prabhas: బాహుబలి కంటే ఆలస్యంగా కల్కి 2 షూటింగ్.. ఎందుకింత ఆలస్యం?

4 నిమిషాల పఠనం

Prabhas: మన టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ 2 కూడా ఒకటి. మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే మొదటి భాగం విడుదలై చాలా కాలం గడుస్తున్నా రెండో భాగం షూటింగ్ మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Prabhas: మన టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ 2 కూడా ఒకటి. మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే మొదటి భాగం విడుదలై చాలా కాలం గడుస్తున్నా రెండో భాగం షూటింగ్ మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పోలిస్తే కల్కి 2 విషయంలో ఎందుకింత ఆలస్యం జరుగుతోందనే ప్రశ్న వినిపిస్తోంది. బాహుబలి రెండు భాగాల నిర్మాణంలో కనిపించిన వేగం, కల్కి సీక్వెల్ విషయంలో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలావరకూ ఇది నిజం కూడా. ప్రభాస్ వరుసగా సినిమాలు కమిటవడం కూడా ఓ ప్రధాన సమస్య. బాహుబలి సమయంలో ప్రభాస్ సమాంతరంగా వేరే సినిమాలు చేయలేదు. కానీ, కల్కి 2 తో పాటు స్పిరిట్, ఫౌజీ చిత్రాలకి డేట్స్ కేటాయించాడు.

బాహుబలి సినిమాను తీసుకుంటే రాజమౌళి మొదటి నుంచే బాహుబలి కథను రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు. రెండు భాగాలకు సంబంధించిన కథ, నటీనటుల డేట్స్, నిర్మాణ ప్రణాళిక విషయంలో ముందుగానే స్పష్టత ఉండటంతో షూటింగ్‌ను ఒక క్రమపద్ధతిలో కొనసాగించారు. పార్ట్ 2 కి కావాల్సిన చాలా సన్నివేశాలను పార్ట్ తో కలిపే కంప్లీట్ చేశాడు జక్కన్న.

కానీ, కల్కి విషయంలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. మొదటి భాగం విజయం తర్వాత రెండో భాగాన్ని మరింత భారీగా రూపొందించాల్సిన బాధ్యత దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఉంది. మొదటి భాగంలో పరిచయం చేసిన ప్రపంచాన్ని మరింత విస్తరించడంతో పాటు, అశ్వత్థామ, భైరవ, సుప్రీమ్ యాస్కిన్ పాత్రల చుట్టూ కథను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అయితే, హీరోయిన్ దీపిక పడుకొణ్ పార్ట్ లో లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. అలాగే, అమితాబ్ వయసు రిత్యా..ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మరోవైపు కమల్ హాసన్ నిర్మాతగా మూడు సినిమాలు, హీరోగా మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన డేట్స్ సమస్య కూడా ఉంది. ఇలాంటి, ఇబ్బందుల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2 పూర్తి చేయాలంటే పెద్ద అగ్ని పరీక్షే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2028 లో గానీ ఈ సినిమా వచ్చే అవకాశాల్లేవంటున్నారు.

#Prabhas#Kalki2#Amithab Bacchan#Kamal Haasan#Nag Ashwin
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి