వైరల్ న్యూస్

Instagram Reels Job Offer: ఇన్‌స్టా రీల్స్ చూస్తే నెల నెలా జీతం.. దిమ్మతిరిగే ఆఫర్.. కానీ!

5 నిమిషాల పఠనం

Instagram Reels Job Offer: పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడమే మీ పనా? ఇంట్లో వాళ్లు “రోజంతా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పైసలేమైనా రాలుతాయా?” అని తిడుతున్నారా? అయితే మీలాంటి సోషల్ మీడియా పిచ్చి ఉన్నవారి కోసమే కళ్లు చెదిరే ఉద్యోగావకాశం మార్కెట్లోకి వచ్చింది.

Instagram Reels Job Offer: పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడమే మీ పనా? ఇంట్లో వాళ్లు “రోజంతా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పైసలేమైనా రాలుతాయా?” అని తిడుతున్నారా? అయితే మీలాంటి సోషల్ మీడియా పిచ్చి ఉన్నవారి కోసమే కళ్లు చెదిరే ఉద్యోగావకాశం మార్కెట్లోకి వచ్చింది. రోజంతా హాయిగా కూర్చుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు.. నెలనెలా మీ అకౌంట్‌లో జీతం పడిపోతుంది. దీపావళి వేళ ఒక కంపెనీ ఇచ్చిన ఈ జాబ్ ఆఫర్ విని నెటిజన్లు ఆనందంతో ఎగిరిపడుతున్నారు. కానీ, ఈ సూపర్ ఆఫర్ వెనుక కంపెనీ పెట్టిన ఒక చిన్న ట్విస్ట్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

ఇంతకీ చేయాల్సిన పనేంటంటే

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరం ఉదయ్‌పూర్‌కు చెందిన 'ఇన్‌ఫ్లూయిష్' అనే సంస్థ ఈ విచిత్రమైన నియామకంతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ కంపెనీ తమ టీమ్ కోసం 'డూమ్‌స్క్రోలర్' పేరుతో సరికొత్త పోస్టును క్రియేట్ చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థి చేయాల్సిన పని ఒక్కటే.. రోజంతా ఆఫీసులో కూర్చుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడటం. ప్లాట్‌ఫామ్‌లో ఏ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి? ఏ కంటెంట్ జనాల్లో వైరల్ అవుతోంది? ఎలాంటి మీమ్స్, ఆడియోలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి? అనే అంశాలపై పూర్తి నిఘా పెట్టి కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి ఆ సంస్థ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. "మీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడటం విపరీతంగా ఇష్టమైతే.. ఆ అలవాటుకే మేము మీకు జీతం ఇస్తాం. రోజంతా ప్రశాంతంగా కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తూ వైరల్ కంటెంట్‌ను కనిపెట్టే ఒక పక్కా 'డూమ్‌స్క్రోలర్' మాకు కావాలి" అంటూ ఆ వీడియోలో కంపెనీ ప్రతినిధి వివరించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఫుల్ టైమ్ ఉద్యోగాలతో పాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా కల్పించారు.

అప్లై చేసుకోవడం ఈజీనే.. కానీ

ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు విపరీతంగా స్పందించారు. "నా డ్రీమ్ జాబ్ దొరికేసింది", "ఈ పోస్టుకు నేనే సరైనోడిని" అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం.. ఇన్స్టా వీడియో కింద కేవలం 'Hi' అని కామెంట్ పెడితే సరిపోతుంది, సదరు సంస్థే నేరుగా డీఎమ్ (DM) ద్వారా అప్లికేషన్ లింక్ పంపుతుంది. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది. ఈ పోస్టు వర్క్ ఫ్రమ్ హోమ్ కానే కాదు. ఈ బంపర్ ఆఫర్ కేవలం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నివసించే స్థానిక అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. దేశం నలుమూలల నుంచి అప్లై చేసుకుందామనుకున్న వేలాది మంది నెటిజన్లకు ఈ కండిషన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏదేమైనా.. టైమ్ వేస్ట్ అలవాటుగా భావించే రీల్స్ స్క్రోలింగ్‌ను కూడా ఒక అర్హతగా మార్చి ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది.

#Instagram Reels Job#Doomscroller Job#Instagram Job Offer#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి