Flight Mode Benefits: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ స్క్రీన్ పైభాగంలో చిన్న విమానం గుర్తు కనిపించే ఉంటుంది. కానీ చాలామంది ఆలోచన ఏంటంటే.. ఇది కేవలం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మాత్రమే ఆన్ చేయాల్సిన ఆప్షన్ అని. నిజానికి మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో మొబైల్ సమస్యలను చిటికెలో పరిష్కరించడానికి, మన ఫోన్ లైఫ్‌ను పెంచడానికి ఫ్లైట్ మోడ్ ఒక అద్భుతమైన సీక్రెట్ టూల్‌లా పనిచేస్తుంది. దీనివల్ల కలిగే అసలైన ప్రయోజనాలు తెలిస్తే రోజూ కచ్చితంగా వాడటం మొదలుపెడతారు.
నిమిషాల్లో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
ఎక్కడికైనా అర్జెంట్‌గా బయల్దేరాలి.. చేతిలో కేవలం పది లేదా పదిహేను నిమిషాలే టైమ్ ఉంది.. బ్యాటరీ చూస్తే డెడ్ అయిపోయే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో వెంటనే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్ పెట్టండి. సాధారణంగా మొబైల్ వెనుక నిరంతరం నెట్‌వర్క్, సిగ్నల్ వెతికే ప్రాసెస్ బ్యాటరీని భారీగా లాగేస్తుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయగానే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోయి, బ్యాటరీ రెట్టింపు వేగంతో ఫుల్ అవుతుంది.
సిగ్నల్, ఇంటర్నెట్ మొరాయిస్తే బెస్ట్ రీసెట్
కొన్నిసార్లు నెట్‌వర్క్ ఫుల్‌గా ఉన్నా కాల్స్ కలవవు.. లేదా మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నా ఇంటర్నెట్ అస్సలు తిరగదు. ఇలాంటి సమయాల్లో వెంటనే ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి.. ఓ 5 సెకన్లు ఆగి మళ్లీ ఆఫ్ చేయండి. ఫోన్ సెల్యులార్ సిస్టమ్ వెంటనే రీఫ్రెష్ అయి, సమీపంలోని బలమైన టవర్‌తో రీ-కనెక్ట్ అవుతుంది. నెట్‌వర్క్, డేటా సమస్యలు చిటికెలో సెట్ అయిపోతాయి.
అర్ధరాత్రి పీస్‌ఫుల్ నిద్ర.. అలారం మిస్ అవ్వదు
రాత్రిపూట ఫోన్ మోగితే నిద్ర పాడవుతుందని స్విచ్ఛాఫ్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అలా చేస్తే మార్నింగ్ పెట్టే అలారాలు మోగవు. అదే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి నిద్రపోతే.. అర్ధరాత్రి వచ్చే అనవసర ప్రమోషనల్ మెసేజ్‌లు, గ్రూప్ వాట్సాప్ పింగ్‌లు, ఫేక్ కాల్స్ ఏవీ రావు. అత్యంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఉదయం మీరు పెట్టుకున్న అలారం యథావిధిగా మోగుతుంది.
గేమింగ్, వీడియోలలో నో డిస్టర్బెన్స్
మొబైల్‌లో ఏదైనా సీరియస్ గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ నోటిఫికేషన్లు విసుగు తెప్పిస్తాయి. వైఫై కనెక్ట్ చేసి ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెడితే.. ఇంటర్నెట్ యథావిధిగా నడుస్తుంది కానీ మధ్యలో వచ్చే కాల్స్ ఏవీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. కేవలం ఫ్లైట్ జర్నీలకే పరిమితం కాకుండా.. అనవసర నోటిఫికేషన్ల ఒత్తిడి నుంచి బయటపడి కాసేపు డిజిటల్ డిటాక్స్ కావాలన్నా, బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవాలన్నా ఫ్లైట్ మోడ్ ఒక పవర్‌ఫుల్ ఆప్షన్‌గా పని చేస్తుంది.


