జాతీయం

Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 30% పెరగనున్న ధరలు!

4 నిమిషాల పఠనం

Smartphone Price Hike: కొత్త స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్న వాళ్లకి బ్యాడ్ న్యూస్. మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల రేట్లు ఊహించని రీతిలో ఏకంగా 30 శాతం వరకు పైకి ఎగబాకే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ 'జెఫ్రీస్' తాజా నివేదికలో హెచ్చరించింది.

ధరల మంట వెనుక అసలు కథ ఇదే..

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డేటా సెంటర్లు, ఏఐ నెట్‌వర్క్‌ల విస్తరణ కోసం పెద్ద ఎత్తున మెమొరీ చిప్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న మెమొరీలో అత్యధిక వాటాను ఈ కంపెనీలే ఎగరేసుకుపోతుండటంతో తీవ్ర కొరత ఏర్పడింది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం చిప్ డిమాండ్‌లో 60 శాతానికి పైగా ఏఐ కంపెనీలదే ఉండనుందని అంచనా. ఈ విపరీతమైన పోటీ వల్ల ముడిసరుకు ధరలు చుక్కలనంటుతున్నాయి.

మూడు రెట్లు పెరిగిన ఖర్చు.. కస్టమర్లపైనే భారం

నిజానికి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయంలో మెమొరీ చిప్‌ల వాటాయే దాదాపు 60 శాతం ఉంటుంది. గతంలో 20 డాలర్లుగా ఉన్న ఒక్కో మెమొరీ చిప్ ధర, డిమాండ్ దెబ్బకు ఇప్పుడు ఏకంగా 60 నుంచి 65 డాలర్లకు పెరిగింది. అంటే చిప్స్ ఖరీదు మూడు రెట్లకు పైగా పెరిగిపోయింది. ఈ అదనపు భారాన్ని కంపెనీలు భరించే స్థితిలో లేకపోవడంతో, ఆ ఖర్చును నేరుగా కొనుగోలుదారులపైనే మోపేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో బడ్జెట్ ఫోన్ల రేట్లు 30 శాతం వరకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరల వల్ల కొత్త ఫోన్లు కొనాలనుకునే వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమో, లేదా పాత రీఫర్బిష్డ్ మోడళ్ల వైపు మొగ్గు చూపడమో చేయాల్సి వస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

#Smartphone Price Hike#Smartphone Prices#Mobile Price Increase#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి