జాతీయం

India vs Pakistan Football: పాక్‌పై భారత్ సంచలన విజయం..

3 నిమిషాల పఠనం

India vs Pakistan Football: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన టీమిండియా 3-2 గోల్స్ తేడాతో దుమ్మురేపే విజయాన్ని అందుకుంది.

India vs Pakistan Football: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన టీమిండియా 3-2 గోల్స్ తేడాతో దుమ్మురేపే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో పాక్ అనూహ్యంగా రెండు గోల్స్ చేసి తీవ్ర ఒత్తిడి పెంచినా.. పట్టువదలని మన ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచారు.

మొదటి నుంచే భారత్ అటాకింగ్ గేమ్

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత ఫార్వర్డ్ సుహైల్ అహ్మద్ భట్ పాక్ డిఫెన్స్‌ను చీల్చుతూ వరుస దాడులు చేశాడు. ఆట 13వ నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి పాక్‌కు గట్టి షాకిచ్చాడు. ఆ జోరులోనే 19వ నిమిషంలో సుహైల్ మరో గోల్ సాధించి భారత్‌కు 2-0 లీడ్ అందించాడు. అనంతరం 32వ నిమిషంలో మాంగ్లెంతాంగ్ కిప్‌గెన్ మరో సూపర్ గోల్‌తో స్కోరును 3-0కి పెంచడంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది.

ఇంజూరీ టైమ్‌లో పాక్ మెరుపులు..

ఆట దాదాపు క్లోజ్ అయ్యిందన్న టైంలో పాకిస్థాన్ ఊహించని కౌంటర్ ఇచ్చింది. ఇంజూరీ టైమ్‌లో (90+1వ నిమిషం) నజీబ్ గోల్ కొట్టగా.. ఆ వెంటనే 90+4వ నిమిషంలో ఘాజీ మరో గోల్ సాధించాడు. కేవలం మూడు నిమిషాల గ్యాప్‌లోనే పాక్ రెండు గోల్స్ కొట్టడంతో గ్రౌండ్‌లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. స్కోరు టై చేసేందుకు పాక్ గట్టిగా ప్రయత్నించినా.. భారత్ ఆటగాళ్లు ఆఖరి వరకు పోరాడి 3-2 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించి టోర్నీని సక్సెస్‌తో స్టార్ట్ చేశారు.

#India vs Pakistan Football#India Football Team#Pakistan Football Team#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి