టాప్ న్యూస్

TG : చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!

7 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నీటి కొరత తీవ్రతరం అవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఎండలు పెరగడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాలు, ఇతర ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది.

రాష్ట్రంలో నీటి కొరత తీవ్రతరం అవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఎండలు పెరగడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాలు, ఇతర ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది.దీంతో నగరంలో వాణిజ్య అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమాచారం.

విద్యాసంస్థలు, హాస్టళ్లకు హాలిడేస్..

హైదరాబాద్‌లో వేసవి రాకముందే నీటి కొరత తీవ్రతరం కావడంతో ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యాసంస్థలు స్కూల్స్, కాలేజీలకు హాఫ్ డే ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని విద్యాసంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. హాస్టల్స్ నుంచి వచ్చేవారికి ముందస్తు దీపావళి సెలవుల పేరిట హాలిడేస్ ప్రకటించాయి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలని, ఆన్లైన్ విధానంలో క్లాసులు బోధిస్తామని ప్రకటించాయి. నగరంలో ఉన్నవారికి మాత్రమే హాఫ్ డే క్లాసులు భోదిస్తున్నట్టు సమాచారం.

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నీటి సౌకర్యం లేక ముందస్తు సెలవులు ప్రకటించి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని మేనెజ్మెంట్స్ కాల్స్ చేసి తల్లిదండ్రులకు చెబుతున్నట్టు తెలిసింది.

మరల తిరిగి విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో చెప్పకుండా, ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని విద్యాసంస్థలు చెబుతున్నట్టు సమాచారం. ముందుగానే ఫీజు డబ్బులు తీసుకుని విద్యార్థులకు ఇంటికి పంపితే వారి చదువు మీద ప్రభావం పడుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు వాణిజ్య కేంద్రాలు, ఐటీ కంపెనీలు సైతం నీటి కొరతను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండటంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సంస్థలకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో పని చేస్తున్న దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటిస్తే నీటి పొదుపు చేయవచ్చని సర్కార్ యోచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోని వాణిజ్య సముదాయాలు, భవంతులు, అపార్ట్మెంట్లలో వాటర్ ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.

నీటిని తేరగా వదిలేసి..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు ముందే హెచ్చరికలు చేశారు. అయితే, జూన్, జూలై నెలల్లో నీటి లభ్యత ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నీటిని తేరగా కిందకు వదిలేసి, ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత ఉన్నప్పుడు నీటిని కిందకు వదిలేయడం ఎందుకు? ఇప్పుడు విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అడుక్కోవడం ఎందుకు? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కాళేశ్వరంలోని కన్నెపల్లి దగ్గర ఇప్పుడు కూడా నీటి లభ్యత ఉన్నా, వాటిని ఎత్తిపోయకుండా రేవంత్ సర్కార్ ఇగోకు పోయి రాష్ట్ర ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ.. లేదంటే నరకమే..

తమ ఉపాధిని కోల్పోయేలా ప్రభుత్వం, హైడ్రా అధికారులు వేధిస్తున్నారంటూ వాటర్ ట్యాంకర్ల ఓనర్లు ఈనెల 3న సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలోనే విద్యాసంస్థలు,వాణిజ్య సముదాయాలు నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.నగరవాసుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె ముగియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.కాగా, హైదరాబాద్‌లోని పలు నివాస ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం 1,000 నుండి 1,500 అడుగుల లోతు బోర్లు వేసి ప్రైవేట్ ట్యాంకర్ల వారు అక్రమంగా నీటిని తోడేస్తున్నారంటూ స్థానికుల నుండి ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు ఆయా అక్రమ బోర్లను సీజ్ చేశారు. దీంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామంటూ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

#Water problems#hyderabad#schools#colleges#holidyas#workfrom home#IT companiees#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి