జాతీయం

సీజేపీకి పాకిస్తాన్, అమెరికా నుంచి నిధులు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణలు!

4 నిమిషాల పఠనం

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నాయకులకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని, ఈ సంస్థకు చెందిన కీలక నేతలకు పాకిస్తాన్ రాజకీయ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

 కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నాయకులకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని, ఈ సంస్థకు చెందిన కీలక నేతలకు పాకిస్తాన్ రాజకీయ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికి, ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడానికి భారత్ వ్యతిరేక విదేశీ ఎన్‌జీఓలు, శక్తుల నుంచి ఈ పార్టీకి ఆర్థిక సాయం అందుతోందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

 మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికాకు చెందిన విదేశీ దాతల నుంచి నిధులు పొందుతుండగా, మరో కీలక నేత అశుతోష్ రాంకా పాకిస్తానీ రాజకీయ నాయకుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్నట్లు నిఘావర్గాల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. మొదట నిరుద్యోగం, విద్యార్థుల పరీక్షల అక్రమాలపై నిరసనలు తెలిపిన సీజేపీ, ఆ తర్వాత ఎస్ఐఆర్ (SIR) వివాదాన్ని తెరపైకి తెచ్చిందని, ఇటీవల ఏకంగా దేశంలో ‘పాలన మార్పు’ (Regime Change) చేయాలంటూ పిలుపునివ్వడం వెనుక పెద్ద విదేశీ కుట్ర దాగి ఉందంటూ మండిపడ్డారు.

 అటు బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ ఎ.సిన్హా సైతం సీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజా జీవితాన్ని గందరగోళంలోకి నెట్టడమే లక్ష్యంగా సీజేపీ నిరసనలు చేపట్టిందని ఆయన విమర్శించారు. నెల రోజులుగా ఈ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలన్నీ దేశంలో తిరుగుబాటు వాతావరణాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు.

 ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, సీజేపీ ఒకేసారి న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న దురుద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీజేపీ నాయకుల విదేశీ నిధుల మూలాలపై (FCRA ఉల్లంఘనలు) కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. విదేశీ ఆర్థిక వనరులను బహిర్గతం చేయకుండా దేశంలో అసంతృప్తిని రెచ్చగొట్టే యత్నాలు సహించేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

#CJPPakistanLinks2026#JitendraSinghAllegations#CockroachJanataParty#AbhijitDipkeForeignFunding#AshutoshRankaPakLinks#NationalNewsTelugu#PoliticalNewsTelugu#DelhiProtests2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి