సినిమా

Kamal Haasan: క్రేజీ లైనప్.. నిర్మాతగా మూడు, హీరోగా మూడు!

5 నిమిషాల పఠనం

Kamal Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో లోకనాయకుడు కమల్ హాసన్ రూటే సెపరేటు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు నిర్మాతగానూ భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కొత్తగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ కెరీర్‌లో ఆరు క్రేజీ ప్రాజెక్టులు ఉండటం విశేషం.

Kamal Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో లోకనాయకుడు కమల్ హాసన్ రూటే సెపరేటు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు నిర్మాతగానూ భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కొత్తగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ కెరీర్‌లో ఆరు క్రేజీ ప్రాజెక్టులు ఉండటం విశేషం. అంతేకాదు, ఈ ఏజ్‌లో ఇలా వరుస సినిమాలతో నిర్మాతగా, హీరోగా బిజీ అవడం చూసి సినీ ప్రముఖులందరూ షాకవుతున్నారు.

కమల్ హీరోగా మూడు భారీ చిత్రాలు!

కమల్ హాసన్ హీరోగా నటించబోతున్న సినిమాల విషయానికి వస్తే ముందుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'భారతీయుడు 3' గురించి చెప్పుకోవాలి. భారతీయుడు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అయితే, మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోగా, రెండవ భాగం మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినా, ఇప్పుడు ఇండియన్ 3 రాబోతుండటం ఒకింత షాక్‌కి గురి చేస్తోంది.

ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించబోతున్న సినిమా మరో ప్రత్యేకమైన సినిమా. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దశాబ్దాల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తమిళంలో ఇలాంటి కాంబినేషన్ కొత్తేమీ కాకపోయినా కమల్-రజినీ అంటే మాత్రం సూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకి సెలవులివ్వాల్సిందే.

మరోవైపు 'చిత్తా', 'వీర ధీర సూరన్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్ కూడా కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఇలా, మూడు సినిమాలతో హీరోగా కమల్ మన ముందుకు రాబోతున్నాడు. ఇవన్నీ, కూడా కమల్ స్టైల్లోనే ఉండబోతున్నాయి.

కమల్ నిర్మాతగా మరో మూడు సినిమాలు!

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కమల్ తన జోరు చూపిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై పలు క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న 'ధర్మన్' సినిమా వీటిలో ఒకటి. 2027, సంక్రాంతికి రాబోతోంది. ఇందులో, నయనతార..రాశీఖన్నా, రాంపోతినేని..శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 'సేయోన్' సినిమాకు కూడా కమల్ నిర్మిస్తున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న 'తలైవర్ 173' ప్రాజెక్ట్ కూడా కమల్ నిర్మాణ సంస్థలోనే నిర్మించబోతున్నారు. ఇలా కొత్త తరం హీరోలతో పాటు సూపర్ స్టార్‌ల సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సాహసాలు చేస్తున్నారు కమల్ హాసన్. అయితే, స్టార్ హీరోయిన్ అయిన తన కూతు శ్రుతి హాసన్‌తో మాత్రం ఒక్క ప్రాజెక్ట్ చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

#Kamal Haasan#Rajinikanth#Kollywood#Movie Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి