తెలంగాణ

TRS : అయ్యప్ప సొసైటీలో సీఎం రేవంత్ సోదరుల అక్రమ దందా : కవిత

4 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మీద తెలంగాణ రక్షణ సమితి (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. నగరంలోని అయ్యప్ప సొసైటీ భూములను సీఎం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కామధేనువుగా వాడుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మీద తెలంగాణ రక్షణ సమితి (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. నగరంలోని అయ్యప్ప సొసైటీ భూములను సీఎం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కామధేనువుగా వాడుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి కేవలం అక్రమార్జన మీదనే దృష్టి సారించాలని మండిపడ్డారు.

గురువారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. నెలరోజుల్లో అయ్యప్ప సొసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే స్వయంగా వెళ్లి అక్రమ భవనాలకు 'రెడ్ మార్క్' వేస్తామని హెచ్చరించారు. భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థుల కోసం అయ్యప్ప సొసైటీలో 150 ఎకరాల్లో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైందని గుర్తుచేశారు. ఆ భూములను కాపాడేందుకు ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు ఎంతో పోరాటం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖానామెట్‌లోని అయ్యప్ప సొసైటీలో 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు పుట్టుకొచ్చాయని చెప్పారు. ప్రస్తుతం మరో 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.

అక్రమ రిజిస్ట్రేషన్ల దందా..

నోటరీల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా 10 నుంచి 12 అంతస్తుల వరకు పర్మిషన్లు ఇస్తున్నారని కవిత ఆరోపించారు. సర్వే నంబర్ 11/18 నుంచి 44 వరకు, సర్వే నంబర్ 12లో విచ్చలవిడిగా రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలపై గూగుల్ మ్యాప్‌తో సహా వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నారని, తమ వెనుక ప్రభుత్వం ఉందంటూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.

రేవంత్ సోదరులదే కీ రోల్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులే దగ్గరుండి అక్రమ అనుమతులు ఇప్పిస్తున్నారని కవిత ఆరోపించారు. మంథనిలో రాత్రికి రాత్రే నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో భారీ ఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణలపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీఐ జవాబుదారీగా పనిచేయడం లేదన్నారు. తక్షణమే ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు, ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

#Khanament#ayyappa society#hyderabad#cm revanth reddy#brothers#illegal permissions#illegal constructions#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి