ఏపీ

AP : పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ నేతల హోరాహోరీ దాడులు

4 నిమిషాల పఠనం

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అయితే, పలు పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోగా స్థానికులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో పాటు పెట్రోల్ బాంబు దాడులు జరిగినట్టు సమాచారం.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అయితే, పలు పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోగా స్థానికులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో పాటు పెట్రోల్ బాంబు దాడులు జరిగినట్టు సమాచారం.

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లెదురు గానే కొందరు పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లి పోలింగ్ బూత్ వద్ద కూడా పెట్రోల్ బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తిరగబడిన స్థానికులు

కడప జిల్లా నందలూరుతో పాటు తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ గూండాలు తరలిరావడంతో స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. గూండాల వాహనాలను అడ్డుకొని వారిపై దాడి చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రౌడీలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇక ఎన్టీఆర్ జిల్లా కలగర పోలింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వైసీపీ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం ఏర్పడగా పోలీసులు రెండు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డగింత..

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పార్నపల్లిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ,వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగేందుకు ప్రయత్నించడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసుల చర్యలు చేపట్టారు. పార్నపల్లిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతకుముందు పులివెందులలో టీడీపీ–వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. రాళ్లు, సోడా బాటిళ్లతో దాడులకు పాల్పడ్డారు.

#mptc zptc elections#pulivendula#ysrcp#tdp#hightension situation#andrapradesh#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి