సినిమా

Ram Charan-RC 17: సుకుమార్, చరణ్‌ల ఆర్సీ 17 బడ్జెట్ రూ.400 కోట్లా?

4 నిమిషాల పఠనం

Ram Charan-RC 17: ఇటీవల ఓపెనింగ్ జరిగినప్పటి నుంచి ఆర్సీ 17 సినిమా మీద రక రకాల చర్చలు సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ జరుగుతున్నాయి. రగస్థలం లాంటి సినిమా తర్వాత సుకుమార్, చరణ్ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా అంటే ఓపెనింగ్ ముందు వరకూ అందరూ ఊహించుకున్నది ఒకటి. కానీ, సుకుమార్ సాలీడ్ షాకిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆర్సీ 17 ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్సీ 17:

ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. మరోవైపు హీరో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ రెమ్యునరేషన్ల విషయంలోనూ భారీ మొత్తాలు వినిపిస్తున్నాయి. చరణ్‌కు రూ.150 కోట్లు, సుకుమార్‌కు రూ.100 కోట్ల వరకు పారితోషికం ఉండొచ్చని మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. ఇప్పుడు వినిపిస్తున్నదాని ప్రకారం అన్నీ కలుపుకొని 400 కోట్ల భారీ బడ్జెట్‌ను మేకర్స్ కేటాయిస్తున్నారట.

అయితే, ఈ 400 కోట్లు ఫస్ట్ వీక్‌లో తిరిగి వచ్చేలా సుకుమార్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ప్రీ బిజినెస్ రూపంలో సగానికి పైగా రికవ్రీ ఉంటుందని ధీమాగా ఉన్నారట సుకుమార్ అండ్ చరణ్. వీరి కాంబోకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. పుష్ప ఫాంఛైజీస్ తర్వాత మార్కెట్‌లో సుకుమార్ రేంజ్ బాగా పెరిగింది. అదే, ఆర్సీ బడ్జెట్ 400 అవడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

కాగా, ఈ నవంబర్ 1న హైదరాబాద్‌లో ఆర్సీ17 పూజా కార్యక్రమాలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరై తొలి క్లాప్ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక, ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారుల విషయంలో సస్పెన్ కొనసాగుతోంది. ముఖ్యంగా, హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ అయ్యేదెవరో సుకుమార్ చేతిలోనే ఉంది. చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టుగా సమాచారం.

#Mega Power Star Ram Charan#Sukumar#Mythri Movie Makers#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి