వైరల్ న్యూస్

ఢిల్లీలో విషాదం: పాఠశాల తరగతి గదిలో కుప్పకూలిని మూడో తరగతి విద్యార్థిని మృతి!

4 నిమిషాల పఠనం

ఢిల్లీలోని మయూర్ విహార్ (Mayur Vihar) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అకస్మిక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. పీటీ(PT) క్లాస్ ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి తరగతి గదికి వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 ఢిల్లీలోని మయూర్ విహార్ (Mayur Vihar) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అకస్మిక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. పీటీ(PT) క్లాస్ ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి తరగతి గదికి వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. చిన్నారి గదిలోకి నడుచుకుంటూ వచ్చి, కొద్దిసేపటి తర్వాత కుప్పకూలిపోయినట్లు గుర్తించారు.

 పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారిని నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ రెడిక్స్ హెల్త్ కేర్ (Malik Radix Health Care) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక వైద్య నివేదికల (MLC) ప్రకారం చిన్నారి గుండెపోటు (Cardiac Arrest) కారణంగా మరణించి ఉండవచ్చని వైద్యులు, పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

 ఈ ఆకస్మిక మృతి పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో అత్యవసర వైద్య సదుపాయాలు మరియు సీపీఆర్ (CPR) వంటి ప్రాథమిక ప్రాణ రక్షణ చర్యలపై అవగాహన లోపించడంపై కుటుంబ సభ్యులు, స్థానికంగా విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లను నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

 పాఠశాలల్లోని పీటీ (Physical Training) క్లాస్‌లో విద్యార్థులు ఆటపాటలు, వ్యాయామాలు, రన్నింగ్ వంటి శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు వారి శరీరానికి ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరుగుతుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి గుండె, ఊపిరితిత్తులు అత్యంత వేగంగా పనిచేయాల్సి వస్తుంది. కండరాలకు తగినంత ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె కొట్టుకునే వేగం (Heart Rate) ఒక్కసారిగా పెరుగుతుంది. పిల్లల్లో గుండెపై పడే ఈ అకస్మాత్తుగా తీవ్రమైన భారం కొన్నిసార్లు ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

#DelhiSchoolTragedy#MayurViharIncident#StudentCardiacArrest#DelhiNewsTelugu#NationalNewsTelugu#SchoolEmergencySafety#HydNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి